ఇంటర్ అడ్మిషన్లు ఆఫ్ లైన్ విధానంలో జరపాలి

0 31

ఆదోని    ముచ్చట్లు:
ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఆఫ్లైన్ పద్ధతిలో జరపాలని తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య అధ్వర్యంలో అర్. డి.ఓ కార్యాలయంలో రెవెన్యూ డివిజన్ అధికారి కె మాలికర్జున స్వామికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగు నాడు విద్యార్థి సమైక్య కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ..కరోనా కష్టకాలంలో ఇంటర్ అడ్మిషన్లు ఎటువంటి రుసుము వసూలు చేయకుండా ఉచితంగా అడ్మిషన్లు జరిపించాలని,తల్లిదండ్రులకు తమ పిల్లలను తమకు ఇష్టం వచ్చిన కళాశాలలో చదివించుకునే స్వేచ్ఛను కల్పించాలని,ఆన్ లైన్ విధానం వలన గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు వారి తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం వలన చదువుకు దూరం అవుతారని,విద్యార్థులు తమకు దగ్గరగా ఉండే కళాశాలల్లో అడ్మిషన్లు దొరకకపోతే చదువును ఆపివేసే ప్రమాదం ఉంటుంది.ఆన్ లైన్ విధానంలో పారదర్శకత ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.ఇంటర్ అడ్మిషన్లు ఆఫ్ లైన్ విధానంలోనే నిర్వహించి అన్నీ కాలేజీలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కల్పించాలి.ప్రభుత్వ అనుమతిలేని , గర్తింపు లేని కళాశాలల వివరాలు ప్రభుత్వ వెబ్ సైట్లలో పొందుపరచాలని,అనుమతిలేని కళాశాలల వివరములపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.ఇంటర్ మొదటి సంవత్సరం చేరే విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా వారికి దగ్గరగా సౌకర్యంగా ఉండే కళాశాలలో అడ్మిషన్లు పొందే అవకాశం ప్రభుత్వం కల్పించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టి ఎన్ ఎస్ ఎఫ్ కర్నూలు పార్లమెంట్ కార్యనిర్వహక కార్యదర్శి తేజ, నియోజకవర్గ అధ్యక్షులు బెస్త జయసూర్య,ప్రధాన కార్యదర్శి రాజా రత్నం,ఉపాధ్యక్షులు గురు, వీరేష్,సోషల్ మీడియా ఇంఛార్జి కిషోర్,శేషి తదితరులు పాల్గొన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

- Advertisement -

Tags:Inter admissions should be done offline

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page