మా తుఝే సలాం’ ఆత్మీయ పురస్కారాలను విజయవంతం చేయండి ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్

0 8


కోరుట్ల  ముచ్చట్లు:
నెత్తుటి ముద్దయి నేల పొత్తిల్లల్లో పడిన నుండి గుండేకు హత్తుకుని మానవ ప్రపంచంలో మన విలువలు పెంచుతు మన మనుగడ కై నిత్యం తపించే మాతృమూర్తులందరికి వందనాలు తెలుపే ‘మా తుఝే సలాం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ కార్యనిర్వహక రాష్ట్ర అద్యక్షులు పేట భాస్కర్ పిలుపు నిచ్చారు.గురువారం కోరుట్ల పట్టణం లోని సి.ప్రభాకర్ స్మారక గ్రంథాలయంలో మా తుఝే సలాం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రజాసంఘాల జేఏసీ కార్యనిర్వహక రాష్ట్ర అధ్యక్షుడు పేట భాస్కర్ పాల్గోని ఆయన
అవిష్కరించారు.ఈ సందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ కథలాపూర్ మండలం భూషణ్ రావు పేట గ్రామంలో ధూంధాం రాష్ట్ర కన్వీనర్ మారంపెల్లి రవీందర్ తల్లి స్మారకార్థం ఈ నెల ఆగస్టు15 న నిర్వహించే మా తుఝే సలాం కార్యక్రమంలో జిల్లా లోని ప్రజాప్రతినిధులు, కళాకారులకు ఆత్మీయ పురస్కారాలతో పాటు మానవత విలువలు పెంపొందించేల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయని,దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను,భారత రాజ్యాంగ రక్షణే లక్ష్యంగా ధూంధాం  ఉంటుందని, కావున అధిక సంఖ్యలో అంబేద్కర్ వాదులు, మేధావులు, సామాజిక వేత్తలు హజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, న్యాయవాది వొటారికారి శ్రీనివాస్, న్యూడెమోక్రసి నాయకులు చింత భూమేశ్వర్,ప్రజా సంఘాల జేఏసీ పట్టణ అధ్యక్షులు రాసకొండ పెద్ద దేవన్న,అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు జాగర్ల రాజయ్య,నాయకులు సంఘర్తి సంజీవ్, మంద రంజిత్, శనిగారపు వినోద్, మారంపెల్లి శ్రీదర్,పానుగంటి భాస్కర్, కాశవత్తుల లక్ష్మీ రాజం,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Make our Tujhe Salaam ‘Spiritual Awards a success
Peta Bhaskar is the state president of the JAC of Communities

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page