ఈనెల 20న నుడా చైర్మన్ గా ముక్కాల ద్వారకానాథ్ ప్రమాణస్వీకారం

0 13

వినాయక విగ్రహంతో ఎమ్మెల్యే ప్రసన్న కు పిలుపు
నెల్లూరు  ముచ్చట్లు:
నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్గా ముక్కాల ద్వారకానాథ్ ఈనెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  నెల్లూరు పట్టణం లోని కస్తూరి దేవి కళాక్షేత్రం ప్రాంగణంలో జరగబోయే నుడా ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వినాయకుని విగ్రహాన్ని బహుకరించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముక్కాల ద్వారకనాథ్ మాట్లాడుతూ జిల్లా మంత్రులు మరియు శాసనసభ్యులు అధికార పార్టీ నాయకులు శ్రేయోభిలాషుల సహకారంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తనకు నుడా చైర్మన్ పదవి దక్కడం జరిగిందని తెలిపారు. తన ప్రమాణ స్వీకారానికి తప్పనిసరిగా హాజరు కావాలని కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని హాజరుకావాలని కోరారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నెల్లూరు నగర పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సహకార సంఘాల సమాఖ్య ఛైర్మన్ కొండూరు అనిల్ బాబు , వవ్వేరు బ్యాంక్ ఛైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి , రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాప వెంకటేశ్వర్లు నాయుడు , మత్స్యకార నాయకుడు ఆవుల వాసు తదితరులు పాల్గొన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Mukkala Dwarkanath will be sworn in as NUDA chairman on May 20

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page