పుంగనూరులో 15న ప్రతి ఇంటి నుంచి జాతీయగీతాలాపన -కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 791

– దేశ చరిత్రలో పుంగనూరు రికార్డు
– త్రివర్ణ పతాకంలో వేలాది బెలూన్లు ఎగురవేయడం

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు పుంగనూరు మున్సిపాలిటిలో తొలిసారిగా 2018 ఆగస్టు 15న పట్టణంలో ఉదయం 8 గంటలకు నిత్యజాతీయగీతాలాపన ప్రారంభించి ఈనెల 15వ తేదీకి మూడు సంవత్సరాలు పూర్తికాబడిందని కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. గురువారం ఆయన జనగణమన కమిటి సభ్యులు పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, వి.దీపక్‌, పి.అయూబ్‌ఖాన్‌, ఎన్‌.ముత్యాల తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సూచనల మేరకు జనగణమన గీతాలాపన కార్యక్రమం ప్రతి రోజు ప్రజలందరు కలసి నిర్వహించడం సువర్ణాధ్యాయం అన్నారు. మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈగీతాలాపన కార్యక్రమాన్ని పట్టణ ప్రజలందరి చేత పాడించేలా నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ మేరకు పట్టణంలో ఈనెల 15న ఉదయం 8 గంటలకు ఆయా సచివాలయ ఉద్యోగులు, వార్డు వలంటీర్లు , మహిళా సంఘాలు , ప్రజాప్రతినిధులు కలసి సైరన్‌ రాగానే ప్రజల సెల్‌ఫోన్‌లలో నుంచి జాతీయగీతాలాపన ఇంటి ముందు నుంచి వినిపించి, ప్రజలందరు దేశ భక్తిని చాటుతూ జాతీయ పతాకానికి వందనం చేసి వెళ్లేలా ప్రజలకు సమాచారం అందించామన్నారు. పట్టణంలోని 60 వేల మంది జనాభాలో సుమారు 40 వేల మందిని ఆదినం భాగస్వామ్యం చేసి, దేశ చరిత్రలో రికార్డు సృష్టిస్తున్నామని కమిషనర్‌ తెలిపారు. అదే సమయంలో త్రివర్ణపతాకం రంగుల్లోని వేలాది బెలూన్లను ఆకాశంలోకి వదలడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని పుంగనూరు కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా ఇనుమడింప చేసే కార్యక్రమంలో భాగస్వామ్యులై , విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు నటరాజ, జెపి.యాదవ్‌, సీనియర్‌ న్యాయవాది వెంకటముని యాదవ్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డి ని కలిసిన ఏపీఎన్జీవో జిల్లా కమిటీ

Tags: National anthem from every house in Punganur on the 15th – Commissioner KL Verma

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page