సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొంపముంచిన వీడియో కాల్

0 20

విశాఖపట్నం ముచ్చట్లు :

 

అమ్మాయి విసిరిన వలపు వలలో చిక్కుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అందులోంచి బయట పడేందుకు ఏకంగా రూ. 24 లక్షలు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. విశాఖపట్టణం జిల్లాలో జరిగిందీ ఘటన. వేపగుంటకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు గతేడాది నవంబరు 6న కవ్వించే ఓ మెసేజ్ వచ్చింది. ‘కాల్‌ మీ ఎనీటైమ్. ఐయామ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ టు టాక్’ అని ఉన్న ఆ మెసేజ్‌లో 55678557 నంబరుకు కాల్ చేయాలని ఉంది. అది చూసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉత్సాహం ఆపుకోలేక ఆ నంబరుకు కాల్ చేశాడు. అటునుంచి ఓ అమ్మాయి మత్తెక్కించేలా మాట్లాడుతూ న్యూడ్‌గా వీడియో కాల్ చేయమని కోరింది. క్షణం కూడా ఆలోచించకుండా ఆమె అడిగిందే తడవుగా వీడియో కాల్ చేశాడు. ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే న్యూడ్ వీడియో కాల్ చేసి ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత యువకుడికి కష్టాలు మొదలయ్యాయి. న్యూడ్ వీడియో కాల్ స్క్రీన్‌షాట్లు పంపిన ఆ యువతి డబ్బుల కోసం డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకుంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించింది. ఈ క్రమంలో మరో ఇద్దరు వ్యక్తులు రంగంలోకి దిగి అతడిని బెదిరించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాకు ఎక్కితే తన పరువు పోతుందని భయపడిన బాధితుడు పలు దఫాలుగా వారు అడిగినంత చెల్లించుకున్నాడు. మొత్తంగా రూ. 24 లక్షలు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ వారి నుంచి వేధింపులు ఆగకపోవడంతో జులై 16న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాంకు ఖాతాల ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించారు.

- Advertisement -

ఎమ్మెల్యే కోటంరెడ్డి ని కలిసిన ఏపీఎన్జీవో జిల్లా కమిటీ

Tags: Software Engineer Short Video Call

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page