ఆగస్ట్ 27న థియేటర్స్‌లో విడుదల కానున్న సుధీర్ బాబు,ఆనంది ‘శ్రీదేవి సోడా సెంటర్’..

0 8

సినిమాముచ్చట్లు:

సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే మణిశర్మ అందించిన పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. ఈ మధ్యే ఈ సినిమా నుంచి విడుదలైన నాలో ఇన్నాళ్లుగా కనిపించని.. అంటూ సాగే డ్యూయెట్‌కు కూడా చాలా మంది స్పందన వస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం ఈ పాటను మరో స్థాయికి చేర్చింది. దాన్ని దినకర్, రమ్య బెహ్రా అంతే అద్భుతంగా ఆలపించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఆగస్ట్ 27న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది శ్రీదేవి సోడా సెంటర్. తమ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయం అంటున్నారు మేకర్స్. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.
నటీనటులు: సుధీర్ బాబు, ఆనంది తదితరులు..

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Sudhir Babu and Anandi ‘Sridevi Soda Center’ will be released in theaters on August 27.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page