టీడ్కోఇండ్లు లబ్దిదారులకు పంపిణీ చేయాలి-సీపీఐ డిమాండ్

0 7

డోన్  ముచ్చట్లు:
టిడికో ఇండ్లు లబ్ధిదారులకు పంపిణి చెయ్యాలని సీపీఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు, స్థానిక పట్టణ పరిధిలోని జాతీయ రహదారి పక్కన(టైలర్స్ కాలనీ)లో నిర్మించిన టీడ్కో ఇండ్లను తక్షణమే లబ్దిదారులకు అప్పగించాలని,మౌలిక సదుపాయాలు సీసీ రోడ్లు, త్రాగునీరు,డ్రెనేజి సౌకర్యాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి లబ్దిదారులకు పంపిణీ చేయాలని సీపీఐ నియోజకవర్గ రంగనాయుడు,జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, సుంకయ్య, పట్టణ కార్యదర్శు నక్కిశ్రీకాంత్, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి రాముడు లు డిమాండ్ చేశారు.బుధవారం స్థానిక మునిసిపల్ కమిషనర్ కె యల్ యన్ రెడ్డి కు  రంగనాయుడు, సుంకయ్య, రాధాకృష్ణ, నక్కిశ్రీకాంత్, రాముడు, ప్రభాకర్, శివ, వెంకటేష్, దస్తగిరి గార్లతో కూడిన సీపీఐ బృందం వినతిపత్రం సమర్పించారు, అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీడ్కో ఇండ్లను పట్టణంలో ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలను మోసం చేసిన ఆనాటి ప్రభుత్వానికి తగ్గిన గుణపాఠం చెప్పారు అని వారు గుర్తుచేశారు, రాష్ట్రంలోని టీడ్కో ఇండ్లను వైస్సార్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పంపిణీ చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చిన నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత రివర్స్ టెండరింగ్ పేరుతో వారి అనుకూల కార్పొరేట్ వారికి టెండర్లను కట్టబెట్టిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అయిన టీడ్కో ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందించడంలో పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు ముఖ్యమంత్రి మరియు పురపాలన శాఖ మంత్రి వారానికి ఒకసారి టీవీ చానల్స్ ముందుకు వచ్చి అప్పుడు పంపిణీ చేస్తాము ఇప్పుడు పంపిణీ చేస్తామని మాట్లాడుతున్న తరుణంలో ఇండ్లు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న లబ్దిదారుల ఆశలపై నీళ్లు చలుతూ ప్రజలను మోసం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు, పట్టణంలోని టీడ్కో ఇండ్లలో ఎక్కడ లేని వింత పరిస్థితి నెలకొంది అని అన్నాడు టీడ్కో ఇండ్లు ఇస్తామని స్థల లబ్దిదారులైన స్థానిక టైలర్స్ నుంచి స్థలం సేకరించారు, అదే విదంగా పట్టణంలోని పేద ప్రజలు ఇంటి కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరను ప్రభుత్వానికి డి డిల రూపంలో డబ్బును చెల్లించారు, కానీ ప్రభుత్వం మారడంతో నిజమైన లబ్దిదారులు కాకుండా అధికార పార్టీ నాయకుల అనుచరులతో నూతనంగా లిస్టు తయారు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని ఆనాడు ప్రభుత్వానికి డబ్బు చెల్లించిన లబ్దిదారులు మోసపోతారు అధికార, ప్రతిపక్ష పార్టీల కొట్లాట వలన”ఆవులు ఆవులు కొట్లాడితే-దూడ కాళ్ళు విరిగినట్లు”అన చందంగా వారి పార్టీల కొట్లాట వల్ల నిజంగా ప్రభుత్వానికి డబ్బు చెల్లించిన పేద ప్రజలు నష్టపోతారనివారు పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో పురపాలన శాఖ మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 20న టీడ్కో ఇండ్లు లబ్దిదారులకు అందిస్తామని మరోసారి ప్రజలను మోసం చేసేందుకు తయారు అయ్యాడు కనీస సౌకర్యాలు అయిన త్రాగునీరు, డ్రెనేజి, సీసీ రోడ్లు లేని వీటిని ఎలా అందజేస్తారని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ఈ నెల 20 లోపు లబ్దిదారులకు పంపిణీ చేయకపోతే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి పిలుపు మేరకు కమ్యూనిస్టు పార్టీఆధ్వర్యంలో లబ్దిదారులను సమీకరించి పంపిణీ చేస్తామని వారు హెచ్చరించారు..

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Teedcoins should be distributed to beneficiaries-CPI demand

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page