కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోనికి ఆహ్వానించిన పాచిపెంట శాంతకుమారి

0 5

విశాఖపట్నం  ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరకు పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ శ్రీమతి పాచిపెంట శాంతకుమారి.* అరకువేలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనంతగిరి మండలానికి చెందిన గుమ్మ పాంచాయితి ఫోర్లు వలస గ్రామ యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా  పాచిపెంట శాంతకుమారి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి  గిరిజన ప్రాంత ప్రజలు ఆదరిస్తున్నారని గిరిజన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవంతో బలపడుతుందని కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆమె అభినందనలు తెలియజేశారు. అనంతగిరి మండలం గుమ్మ  పంచాయతీ పోరులువలస గ్రామం సిమోన దేముడు, పట్టం పోకల్యా పట్టం సింహాచలం, పట్టం బుచ్చన్నా,పట్టం కృష్ణ,పట్టం  దేముడు,పడి బాల్లయ్య తో గిరిజన యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, ఆమె వివరించారు. కాంగ్రెస్ పార్టీలో నూతనంగా చేరిన యువకులు  మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ప్రజలకు ఏమాత్రం కూడా  న్యాయం చేయాలేదని  కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అదేవిధంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో  శాంత కుమారి  పార్టీ కోసం ఆదివాసి ప్రజల హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు కోసం అనునిత్యం పోరాడుతూ ప్రజలకు చేరువలో కష్టసుఖాలను తెలుసుకుంటు సహకరిస్తున్నారని ఆమెపై నమ్మకంతో మా గ్రామం నుండి పలువురు యువకులు పార్టీలో చెరరారు  అని వారు తెలిపారు పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషిని అందిస్తామని వారు చెప్పారు  కార్యక్రమంలో అరకు అసెంబ్లీ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మొస్య ప్రేమ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి శెట్టి భగత్రం పాల్గొన్నారు.

 

 

Tags:The Congress party invited him into the party wearing a scarf
Pachipenta Shantakumari

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page