ఆడపిల్ల పుట్టిందని ఇంట్లోకి రానివ్వలేదు..!

0 9

నర్సీపట్నం ముచ్చట్లు :

 

ఆడపిల్ల పుట్టిందని భార్యను ఇంట్లోకి రానివ్వకుండా తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు. దీంతో ఆమె తన అత్తవారి ఇంటి వద్ద బైఠాయించింది. రావికమతం గ్రామానికి చెందిన టి.పార్వతికి నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లికి చెందిన రామకృష్ణతో 2019 మార్చిలో వివాహం జరిగింది. రూ.12 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. రామకృష్ణ విశాఖలో వార్డు సచివాలయం సెక్రటరీగా పని చేస్తున్నాడు. పాప పుట్టి ఏడాదిన్నర అవుతున్నా కాపురానికి తీసుకురాకుండా అత్త, మామలు అడ్డుపడుతున్నారు. దీంతో మానసిక వేదనతో తన తల్లి ఇటీవల మృతి చెందిందని, తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తోబుట్టువు వద్ద తలదాచుకుంటున్నానని ఆమె చెప్పింది. న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించినట్టు చెప్పింది.

- Advertisement -

ఎమ్మెల్యే కోటంరెడ్డి ని కలిసిన ఏపీఎన్జీవో జిల్లా కమిటీ

 

Tags: The girl did not come home because she was born ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page