అర్బ‌న్ జిల్లా హ‌న్మ‌కొండ‌గా, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా వ‌రంగ‌ల్ జిల్లా మార్పు

0 7

తుది నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం
హైద‌రాబాద్  ముచ్చట్లు:

అర్బ‌న్ జిల్లాను హ‌న్మ‌కొండ‌గా, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాను వ‌రంగ‌ల్ జిల్లా మార్చుతూ ప్ర‌భుత్వం తుది నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది..దీనితో వరంగల్, హన్మకొండ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. చారిత్రక ప్రదేశాలకు ప్ర‌భుత్వం చక్కని గుర్తింపునిచ్చింది వ‌రంగ‌ల్ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిస్తూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ప్ర‌జ‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల విజ్ఞ‌ప్తి మేర‌కు సీఎం తీసుకున్న ఈ నిర్ణయాన్ని యావత్తు పూర్వ వరంగల్ జిల్లా ప్రజలంతా ముక్త కంఠంతో అభినందిస్తున్నారని మంత్రి చెప్పారు.
తాజా మార్పుతో జిల్లాల స్వ‌రూపం :
హన్మకొండ జిల్లా :
12 మండ‌లాల‌తో హ‌న్మ‌కొండ జిల్లా, 15 మండ‌లాల‌తో వ‌రంగ‌ల్ జిల్లాను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. హ‌న్మ‌కొండ జిల్లాలో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం మొత్తం క‌లుస్తుండ‌గా, స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌కు చెందిన ధ‌ర్మ‌సాగ‌ర్‌, వేలేరు, ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌ర‌కాల‌, నడికుడ‌, దామెర మండ‌లాలు, హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి భీమ‌దేవ‌ర‌ప‌ల్లి, ఎల్క‌తుర్తి మండ‌లాలు, హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి క‌మాలాపూర్ క‌లిశాయి. వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఐన‌వోలు, హ‌స‌న్‌ప‌ర్తి మండ‌లాలు కూడా హ‌న్మ‌కొండ జిల్లాలోనే ఉన్నాయి.
వ‌రంగ‌ల్ జిల్లా :
వ‌రంగ‌ల్ జిల్లాలో ప్ర‌స్తుత వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం మొత్తం ఉంటుంది. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గీసుగొండ‌, ఆత్మ‌కూరు, శాయంపేట, సంగెం మండ‌లాలు, వ‌ర్ధ‌న్న‌పేట నియోజక‌వ‌ర్గం నుంచి వ‌ర్ధ‌న్న‌పేట‌, ప‌ర్వ‌త‌గిరి, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాయ‌ప‌ర్తి, న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాలు న‌ర్సంపేట‌, చెన్నారావుపేట‌, న‌ల్ల‌బెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ వ‌రంగ‌ల్ జిల్లాలో ఉన్నాయి. వ‌రంగ‌ల్ జిల్లాలో వ‌రంగ‌ల్‌, ప‌ర‌కాల రెవెన్యూ డివిజ‌న్లు ఉన్నాయి. కొత్త‌గా క‌మాలాపూర్ మండ‌లం ప‌ర‌కాల ప‌రిధిలోకి రావ‌డం గ‌మ‌నార్హం.
కొత్తగా ఏర్పడబోయే హన్మకొండ జిల్లాలో 12 రెవెన్యూ మండలాలు, 139 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అలాగే వరంగల్ జిల్లాలో 15 రెవెన్యూ మండలాలు, 217 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెండు రెవిన్యూ డివిజన్లు, ఆరు నియోజకవర్గాల స‌మ్మిళితంతో హ‌న్మ‌కొండ జిల్లా అవ‌త‌రించింది. ఐదు నియోజ‌క‌వ‌ర్గాల స‌మ్మిళితంతో, రెండు రెవెన్యూ డివిజ‌న్లు (వ‌రంగ‌ల్‌, న‌ర్సంపేట)తో వ‌రంగ‌ల్ జిల్లా అవ‌త‌రించింది.
హ‌న్మ‌కొండ జిల్లాలో12 మండ‌లాలు:
హ‌న్మ‌కొండ‌, కాజీపేట‌, ఐన‌వోలు, హ‌స‌న్‌ప‌ర్తి, వేలేరు, ధ‌ర్మ‌సాగ‌ర్‌, ఎల్క‌తుర్తి, భీమ‌దేవ‌ర‌ప‌ల్లి, క‌మాలాపూర్‌, ప‌ర‌కాల‌, న‌డికూడ‌, దామెర‌.
వ‌రంగ‌ల్ జిల్లాలో15 మండ‌లాలు:
వ‌రంగ‌ల్‌, ఖిలావ‌రంగ‌ల్‌, గీసుగొండ‌, ఆత్మ‌కూరు, శాయంపేట‌, వ‌ర్ధ‌న్న‌పేట‌, రాయ‌ప‌ర్తి, ప‌ర్వ‌త‌గిరి, సంగెం, న‌ర్సంపేట‌, చెన్నారావుపేట‌, న‌ల్ల‌బెల్లి, దుగ్గొండి, ఖానాపూర్‌, నెక్కొండ‌.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Urban District Hanmakonda, Warangal Rural District Warangal District Change

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page