రెవెన్యూ  శాఖకు అధికారులు ఎవరు…

0 8

విశాఖపట్టణం  ముచ్చట్లు:
విశాఖ తహసీల్దార్ కార్యాలయాలలో ఏసీబీ దాడులుపై ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులను ఖండించిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు విశాఖపట్నంలో ఈ అంశంపై ఇవాళ తమ వాణి వినిపించారు. సహజంగా ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకున్నా.. అధిక ఆస్తులు కలిగి ఉన్నా ఏసీబీ దాడి చేస్తారు. అయితే రెవెన్యూ శాఖలో కార్యాలయాల పని విది విధానాలపై ఏసీబీ సమీక్షను కొత్తగా చూస్తున్నాం అని ఆయన వ్యాఖ్యానించారు.ఏసీబీ దాడులు దురదృష్టకరమన్న ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు.. ఏసీబీ సమీక్ష చేస్తే మరి మా ఉన్నతాధికారులు అంతా ఏమైనట్టు? అని నిలదీశారు. “మా ఉన్నతాధికారులకు చర్యలు తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది కదా.. ఏసీబీ చూపిన లోపాలన్ని మా కార్యాలయ పనులకి సంబంధించినవే తప్ప, అవినీతి చేసినట్లు ఎక్కడా లేదు.. ఏసీబీ దాడుల వల్ల ప్రతి ఉద్యోగి ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులపై విచారణకు సంబందించి రిలీజ్ అయిన GO లను ఉపసంహరించుకోవాలి” అని ఆయన డిమాండ్ చేశారు. రెవెన్యూ ఆఫీస్ నిర్వహణలో ఏమైనా లోపాలుంటే జిల్లా కలెక్టర్ విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. మేము లంచాలు తీసుకునే ఉద్యోగులపై ఏసీబీ జరిపే దాడులకు వ్యతిరేకం కాదు. పేరుకు రెవెన్యూ శాఖ అయినప్పటికీ.. మాకు సంబంధం లేని అనేక అంశాలను మేము నిర్వహిస్తున్నాం. నేటికీ రెవెన్యూ శాఖ ఉద్యోగులకు జాబ్ చార్ట్ లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. Online లో దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ ఫైల్ లు ఎందుకు మెయిన్‌టైన్  చేయాలి? పాస్ పుస్తకాలు లబ్దిదారులు తీసుకోకపోతే అవి తహసీల్దార్ కార్యాలయంలో ఉంటాయి. పాస్ పుస్తకాలు ఏమీ నగదు కాదే..” అంటూ ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా పలు అంశాలు లేవనెత్తారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Who are the officials of the Revenue Department …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page