పబ్లిక్ టాయిలెట్లు ప్రజల వినియోగం లోకి వస్తాయా ?.రావా ?.

0 7

నగర కమిషనర్ దృష్టిసారించాలి.
ఏ ఐ వై ఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్
నెల్లూరు  ముచ్చట్లు:
నగరంలో పలుచోట్ల మల విసర్జన కోసం ఈ టాయిలెట్లు నిర్మించడం జరిగింది .కానీ వాటికి తాళాలు వేసి ఉన్నాయి. తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి అవి ప్రజల వినియోగంలోకి వస్తాయా ? రావా అనే సందిగ్ధంలో సింహపురి ప్రజలు ఉన్నట్లు ఏ ఐవైఎఫ్ నాయకులు పేర్కొన్నారు. గురువారం నెల్లూరు నగర గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేయబడిన పలు పబ్లిక్ టాయిలెట్లను ఏ ఐ వై ఎఫ్ జిల్లా కమిటీ పరిశీలించింది.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ సయ్యద్ సిరాజ్ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో మలవిసర్జన కోసం గత ప్రభుత్వం ,ఈ టాయిలెట్స్ నిర్మించడం జరిగింది ,కానీ ఇవి ప్రారంభ దశలో నుండి ఉపయోగంలో లేవు. ప్రజల అవసరార్థం నిర్మించిన ఈ టాయిలెట్స్ నిరుపయోగంగా ఉన్నాయి. ఇవి ప్రజలకు అందుబాటులో వస్తాయా లేక పనికి రాకుండా పోతాయా అని అని తమ సందేహం వ్యక్తపరిచారు. ప్రజల సొమ్మును ఇలా వృధా చేయడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు . ప్రజల వినియోగం కోసం ఏర్పాటు చేయబడిన పబ్లిక్ టాయిలెట్లు ఉపయోగకరంగా లేకపోవడంపై నెల్లూరు మున్సిపల్ కమిషనర్ దృష్టి సారించాల్సి ఉందన్నారు .వెంటనే ఈ టాయిలెట్లను ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి నూర్ ఖాన్ భాషా , పటాన్ భాషా తదితరులు పాల్గొన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

- Advertisement -

Tags:Will public toilets come into public use?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page