ధరూర్ క్యాంపు లోనే మెడికల్  కళాశాల ఏర్పాటు చేయాలి

0 9

బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
ఎమ్మెల్యే, మాజీ మంత్రి కి వినతి

జగిత్యాల  ముచ్చట్లు :
జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాల ను  అందరికి అందుబాటులో ఉండే పట్టణంలోని ధరూర్ క్యాంపులోనే ఏర్పాటు చేయాలని కోరుతూ బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల నాగరాజు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి ఎల్. రమణలను కోరారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెరస పార్టీ కార్యక్రమంలో బిసి సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి కి వినతి అందజేశారు.ఈ సందర్భంగా గాజుల నాగరాజు మాట్లాడుతూ మెడికల్ కళాశాల తోపాటు మల్టిస్పెషలిటీ ఆసుపత్రి సైతం ధరూర్ క్యాంపు లోనే ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని కోరారు.  ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నీ నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. జిల్లా కేంద్రంతో పాటు మిగతా నియోజకవర్గాలు, డివిజన్ కేంద్రాలు, మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం, అన్ని విధాల ధరూర్ క్యాంపు స్థలం  ,అనుకూలంగా ఉంటుందని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేవిధంగా చర్యలు తీసుకోవాలని నాగరాజు కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శలు మానాల కిషన్ ,ఓరుగంటి భార్గవరామ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతాంశెట్టి సతీష్ రాజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు బ్రహ్మాండబేరి నరేష్, రాష్ట్ర కార్యదర్శి సిరిపురం మహేందర్,ఆకుల నాగరాజు, వరికుప్పల కృష్ణ, గుగ్గిళ్ల సత్యనారాయణ, పాలొజు సత్యం, తొలిప్రేమ శ్రీనివాస్, పెండెం చిన్న గంగాధర్,బాలే వరుణ్ కుమార్, బొమ్మకంటి చంద్రయ్య పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Tags:A medical college should be set up in the Dharur camp itself

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page