10 వేల లోపు అగ్రి చెల్లింపులు

0 30

విజయవాడ ముచ్చట్లు :

 

అగ్రిగోల్డ్‌ బాధితుల నుంచి వినతులు రావడంతో అధికారులు సానుకూలంగా స్పందించారు. డిపాజిట్‌దారులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు మరో రెండు రోజులు గడువు పొడిగించారు. రూ.20వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు agrigolddata.in వెబ్‌సైట్‌లో ఆధార్ నమోదుతో పూర్తి వివరాలును చూడవచ్చు. ఒక వేళ వివరాలను మార్పు చేయాల్సివస్తే ఎంపీడీవో ఆఫీస్‌ ద్వారా సరిచేసుకునే అవకాశం కల్పించారు. ఏవైనా సందేహాలుంటే టోల్‌ ఫ్రీ నంబర్ 1800-4253875 సంప్రదించాలని సూచించారు.ఏపీ ప్రభుత్వం రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులను ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 24న సీఎం వైఎస్‌ జగన్‌ ఆ డిపాజిట్‌ దారుల బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయనున్నారు. అగ్రి గోల్డ్‌ సంస్థలో రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు కట్టిన డిపాజిట్‌దారులు సంబంధిత చెక్కు, పే ఆర్డర్, రశీదులు, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు వివరాలను తమ గ్రామ/వార్డు వలంటీర్‌ వద్ద నమోదు చేయించుకోవాలని సీఐడీ కోరింది.
అగ్రిగోల్డ్ బాధితులు సంబంధిత వివరాలను గ్రామ/వార్డు వాలంటీర్‌ ద్వారా నమోదు చేయించుకోవాలి. కోర్టు పేర్కొన్న జాబితా ప్రకారం చెల్లింపులు జరుగుతాయి.. డిపాజిట్‌దారులకు రావాల్సిన నగదును వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు. ఇతరుల బ్యాంకు అకౌంట్లను సమ్మతించరు.. ఒక డిపాజిట్‌దారు ఒక క్లెయిమ్‌కే అర్హులు. చనిపోయిన డిపాజిట్‌దారుల డిపాజిట్‌ మొత్తాలను వారి చట్టబద్ధ సంబంధికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. కాబట్టి వారు లీగల్‌ హైర్‌ సర్టిఫికెట్‌ కూడా సమర్పించాలి. గతంలో రూ.10 వేల లోపు క్లెయిమ్‌ పొందిన వారు ప్రస్తుతం అనర్హులు. ఒక్కసారి కూడా నగదు పొందని వారే ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవాలి.

- Advertisement -

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

Tags: Agri payments less than 10 thousand

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page