మొక్కలు నాటే కార్యక్రమాన్ని తలపెట్టిన అఖిల భారత చిరంజీవి యువత

0 9

నెల్లూరు  ముచ్చట్లు :
అఖిలభారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో భారత దేశ వ్యాప్తంగా మొక్కలు నాటి పెంచి  పోషించేందుకు శ్రీకారం చుట్టింది . ఇందులో భాగంగానే తమిళనాడు లోని చెన్నై నగరానికి చెందిన చిరంజీవి యువత నాయకులు క్రోమ్ పేట నందు అన్నయ్య చిరంజీవి  జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పట్టణంలోని పలు ప్రాంతాలలో పచ్చని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నివాసులు, చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా చిరంజీవి యువత ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పెంచాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి పేరుతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పరిశ్రమల కారణంగా అత్యధిక కాలుష్యం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం విశ్వమంతా ఆవరించియున్న కాలుష్యాన్ని నివారించేందుకు పచ్చని మొక్కలు నాటాలని అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే చిరంజీవి సూచనలు సలహాలతో  తమ వంతు చేయూతగా అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. అఖిల భారత చిరంజీవి యువత తలపెట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చిరంజీవి  యువత రాష్ట్ర నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చెన్నై నగర చిరంజీవి యువత నాయకులు ఆర్ముగం   వెంకటేశ్వర్లు , జయశంకర్,మురళి, తదితరులు పాల్గొన్నారు.

Tags:All India Chiranjeevi youth headed the planting program

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page