న్యూడ్ కాల్ అంటూ బ్లాక్ బెయిల్

0 30

విశాఖపట్టణం ముచ్చట్లు :

 

విశాఖ నగరంలో హానీ ట్రాప్ కేసు కలకలంరేపింది. హైదరాబాద్‌‌కు చెందిన భార్యాభర్తలు.. వైజాగ్‌కు చెందిన యువకుణ్ని ట్రాప్ చేశారు. వేపగుంట ప్రాంతానికి చెందిన యువకుడిని ఆన్‌లైన్ ద్వారా పరిచయం చేసుకున్న మహిళ.. ఆ తర్వాత అతణ్ని మాటలతో కవ్వించింది. సీన్ కట్ చేస్తే ఆవేశంలో కక్కుర్తి పడ్డాడు.. న్యూడ్‌గా వీడియో కాల్ చేయాలని చెప్పడంతో బుట్టలో పడిపోయాడు. ఆ తర్వాత అతడు నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతుండగా రికార్డ్ చేసింది. ఆ వీడియోను అతడికి పంపించి.. డబ్బులు ఇవ్వకపోతే.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించింది.పాపం యువకుడు మోసపోయానని గ్రహించాడు.. పరువు పోతుందని భయపడిన బాధితుడు.. దపదఫాలుగా వారికి రూ.24 లక్షలు సమర్పించుకున్నాడు. అప్పటికీ వారి వేధింపులు తగ్గలేదు.. రోజురోజుకీ ఎక్కువ అవుతుండటంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు.. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.. భార్య భర్తలు జ్యోతి, వీర సతీష్‌తో పాటు అబ్దుల్ రహీం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి మూడున్నర లక్షల రూపాయల నగదు, ఒక ల్యాప్‌టాప్, 5 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని క్రైమ్‌ డీసీపీ సురేష్‌ బాబు తెలిపారు.

 

- Advertisement -

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

Tags: Black bail for nude call

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page