పుంగనూరులో పంటలను ఈక్రాప్‌లో నమోదు చేసుకోవాలి-అక్కిసాని భాస్కర్‌రెడ్డి

0 76

పుంగనూరు ముచ్చట్లు:

 

 

రైతులు తాము పండించే పంటలను తప్పకుండ ఈక్రాప్‌లో నమోదు చేసుకోవాలని మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు. శుక్రవారం మండల కార్యాలయంలో ఏడి లక్ష్మానాయక్‌ ఆధ్వర్యంలో రైతు సలహ మండలి సమావేశాన్ని ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డితో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు అవసరమైన పరికరాలు, ఎరువులు, విత్తనాలు ఆర్‌బికెలలో అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అలాగే పశువర్థకశాఖ తరపున 70 శాతం సబ్సిడిపై జొన్న విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతులు పంట నమోదు చేసుకోవడంతో భీమా లభించేందుకు సులభతరమౌతుందన్నారు. ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పశువర్థకశాఖ ఏడి మనోహర్‌, ఎంపీడీవో రాజేశ్వరి, ఏవో సంధ్య, రైతులు రామచంద్రారెడ్డి, ధనుంజయరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

Tags: Crops in Punganur should be registered in ICROP-Akkisani Bhaskarreddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page