వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మౌలిక వసతులకు చేయూత అందించిన ఫెడోరా సీ ఫుడ్స్

0 2

ఆధునిక వసతులను లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరుముచ్చట్లు :

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలో పాల్గొని ఫెడోరా సీఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెల్లూరు వారి సహాయసహకారంతో స్వామివారి పవిత్రోత్సవ మండపం, గాలిగోపురం లోపల అనినేటి మండపం మరియు నూతన వంటశాలలను  నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ  ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి దేవస్థానాన్ని జిల్లాలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిదేందుకు కృషిచేస్తా తనవంతు కృషి చేస్తానన్నారు.  శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే గా నేను మరియు జిల్లా కలెక్టర్  50 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపించటం జరిగిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు పర్యాటక, దేవాలయాల అభివృద్ధికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న కృషి ప్రశంసనీయం అని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి అన్నివిధాలా ఆర్థిక సహకారం అందిస్తున్న టువంటి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, జిల్లా కలెక్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు ఆలయ కమిటీ చైర్మన్ ఇందూపూర్ శ్రీనివాస్ రెడ్డి ,దేవరపాలెం సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి, ఉపసర్పంచ్ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి, అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ ఛైర్మెన్ యేసు నాయుడు, ఎండోమెంట్ అసిస్టెంట్ కమీషనర్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, వైకాపా సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Tags:Fedora Sea Foods provided by Infrastructure at Vedagiri Lakshmi Narasimha Swamy Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page