భర్త బలవంతపు శృంగారం తప్పు కాదు…

0 30

ముంబై  ముచ్చట్లు :
‘ఒక మహిళకు ఇష్టం లేకుండా ఆమెను ముట్టుకునే హక్కు ఏ మగాడికీ లేదు. ముట్టుకోవద్దు అంటే ముట్టుకోవద్దు. ఫ్రెండ్ అయినా.. బాయ్‌ఫ్రెండ్‌ అయినా.. మొగుడైనా.. ఏ మగాడైనా అని ‘వకీల్ సాబ్’లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. మహిళకు ఇష్టం లేకుండా మొగుడైనా సరే ఒంటి మీద చేయి వేయకూడదన్నది ఆ డైలాగ్ సారాంశం. అయితే తాజాగా ఓ కేసులో
ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. భార్యాభర్తల మ‌ధ్య బ‌ల‌వంత‌పు శృంగారం చట్టవిరుద్దం కాద‌ని పేర్కొంటూ ముంబై అడిష‌న‌ల్ సెష‌న్స్ జ‌డ్జి సంజ‌శ్రీ జే ఘ‌ర‌త్ సంచలన తీర్పు ఇచ్చారు. దీంతో ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.వివరాల్లోకి వెళ్తే… మహారాష్ట్ర రాజధాని ముంబయికి చెందిన యువతికి గతేడాది నవంబర్ 22న ఓ వ్యక్తితో వివాహమైంది. పెళ్లయిన కొద్దిరోజులకే అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అతడి కుటుంబసభ్యులు ఆమెను వేధింపులకు గురిచేశారు. దీంతో పాటు ఆమె వద్దంటున్నా వినకుండా భర్త బలవంతంగా ఆమెతో లైంగిక కోరికలు తీర్చుకునేవాడు. బలవంతంగా సెక్స్ సమయంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో నడుము కింది భాగం పక్షవాతానికి గురైంది. దీంతో ఆమె భర్త, అత్తింటి వారిపై కోర్టుకెక్కింది. కట్నం పేరుతో వేధించడంతో పాటు తన భర్త బలవంతంగా సెక్స్ చేసి తన అనారోగ్యానికి కారణమయ్యాడని పిటిషన్లో పేర్కొంది.ఈ కేసుపై విచారణ జరిపిన ముంబయి హైకోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి సంజశ్రీ జె ఘరాత్ సంచలన తీర్పు ఇచ్చారు. పెళ్లి తర్వాత భార్యతో భర్త బలవంతంగా సెక్స్ చేస్తే అది చట్ట విరుద్ధం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న వయసులోనే ఆమెకు పెరాలసిస్ రావడం బాధాకరమైన విషయమే అయినప్పటికీ, అందుకు కారణం భర్త బలవంతంగా సెక్స్ చేయడం కాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో దంప‌తుల మ‌ధ్య బ‌ల‌వంతపు శృంగారం అనే విషయం చ‌ట్టం ముందు నిలబడదంటూ స్పష్టం చేస్తూ ఆమె భర్తకు బెయిల్ మంజూరు చేశారు.

 

 

Tags:Husband forced sex is not wrong …

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page