ఆటోలో  టాయ్ లెట్

0 18

హైదరాబాద్ ముచ్చట్లు :

 

ఆటో అంటే ప్యాసింజ‌ర్స్ కోసం వాడ‌టం చూశాం.. చెత్త తీసుకెళ్లే ఆటో చూశాం.. ట్రాన్స్‌పోర్ట్ ఆటో చూశాం… బిజినెస్ కోసం ఉప‌యోగించ‌టం చూశాం… ఆటోలో టాయిలెట్ ఏర్పాటు చేయ‌డం మ‌నం ఎప్పుడైనా.. ఎక్కడైనా చూశామా..! ఇప్పటి వ‌ర‌కు చూడ‌లేదు క‌దా… అయితే ఇప్పుడు దీనిని సాధ్యం చేసింది హైద‌రాబాద్‌కు చెందిన మ‌హిళ‌. షీ టాయిలెట్ పేరుతో ఆటోలో క్లీన్ టాయిలెట్ ఏర్పాటు చేసి అందరిని ఆశ్చర్యప‌రిచింది. ప్రస్తుతం ఈ ఆటోలు హైద‌రాబాద్ న‌గ‌ర వీధుల్లో తిరుగుతున్నాయి. ప్రపంచ‌ంలోనే ఫ‌స్ట్ టైం.. సృజ‌నాత్మకంగా త‌యారైన ఈ టాయ్‌లెట్ ఆటో విశేషాలు తెలుసుకుందాం…క‌ల్లెంపూడి సుష్మ అనే మ‌హిళ 2017లో అమెరికా నుంచి హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చింది. న‌గ‌రంలో మ‌హిళ‌లు బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు టాయిలెట్ కోసం వారికి ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను గ‌మ‌నించింది. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం తీవ్రంగా ఆలోచించింది. చివ‌రికి ఓ ఆటోను మొబైల్ షీ టాయ్‌లెట్‌గా మార్చింది. ఈ ఆటోను జీహెచ్ఎంసీ అధికారుల‌కు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌కు చూపించింది. మొబైల్ షీ టాయ్‌లెట్ వ‌ల్ల ర‌ద్ధీ ప్రాంతాల‌లో మ‌హిళ‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని, ప‌ర్యావ‌ర‌ణ హితంగా ప‌ని చేస్తాయ‌ని గుర్తించిన అధికారులు ఇలాంటి ఆటోలు మ‌రిన్ని ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప‌రిధిలో 25 ఆటోల న‌గ‌ర వీధుల్లో  తిరుగుతున్నాయ‌ని అధికారులు తెలిపారు.ఒక్కో ఆటో త‌యారీకి రూ.4 ల‌క్షల వ‌ర‌కు ఖ‌ర్చవుతుంద‌ని అధికారులు తెలిపారు. మొబైల్ షీ టాయిలెట్ ఆటోలో 100 లీట‌ర్ల కెపాసిటీ వాట‌ర్ ట్యాంక్‌, అద్దం, హ్యాంగ‌ర్‌, వాష్‌బేసిన్‌, ఫ్లేష్‌, డ్రైనేజ్ సిస్టం ఉంటాయి. అదే విధంగా చంటి పిల్లల‌కు డైప‌ర్స్ మార్చడానికి అనువుగా ఉంటుంది. మ‌హిళ‌ల‌కు అత్యవ‌స‌రంగా కావాల్సిన శానిట‌రీ ప్యాడ్స్ ఉచితంగా ఉంటాయి. శానిట‌రీ న్యాప్కిన్స్‌, సెల్‌ఫోన్ ఛార్జింగ్ పాయింట్ సౌక‌ర్యాలు ఇందులో ఉన్నాయి. ప్రతి ఆటోకు జీపీఎస్ క‌నెక్టెవిటీ ఉంది. పాత ఆటోల‌ను ఈ విధంగా మార్చడం జ‌రిగింద‌ని, మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని తెలిపారు సుష్మ, స్వచ్చ భార‌త్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మ‌రింత ప్రోత్సాహం అందిస్తే.. వంద‌లాది వాహ‌నాల‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

Tags: Let the toy in the auto

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page