ఇద్దరు కుమార్తెల వివాహాలు రెండు కల్యాణ లక్ష్మి చెక్కులు..

0 9

రెండు చెక్కులతో తల్లి ఆనందోత్సాహం..

- Advertisement -

మహబూబ్ నగర్    ముచ్చట్లు :

రూ.2,00,232/- విలువైన రెండు కల్యాణ లక్ష్మి చెక్కులు అందుకున్న ఆ మాతృమూర్తి కళ్ళలో ఆనంద భాష్పాలు కనిపించాయి. వివరాల్లోకి వెళితే దేవర్ కద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం భూత్కూర్  గ్రామానికి చెందిన సంధ్యాపగ మణెమ్మ, కుర్మన్న దంపతుల ఇద్దరు పిల్లలు అరుణ, మహేశ్వేరి.  ఇటీవలే ఇద్దరి వివాహాలు జరిపించారు. ఈరోజు దేవర్ కద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేతులమీదుగా వారి ఇద్దరు కుమార్తెల కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన చెక్కులను కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి గ్రామంలో అందజేశారు. ఆ చెక్కులను తీసుకున్న మణెమ్మ  మురిసిపోయింది. ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆనంద భాష్పాలు ఆమె కళ్ళల్లో కనిపించాయి.  తెలంగాణ సీఎం కేసీఆర్ నాకు రెండు  చెక్కులు పంపించాడు అంటూ అబ్బుర పడింది.  తెలంగాణ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటాం కరోన కష్టకాలంలో ఇంత పెద్ద సహాయం చేయడం మా అదృష్టం..  ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ సార్ కు ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాం అని ఆనందంతో చెప్పింది మణెమ్మ ..!

 

Tags:Marriages of two daughters Two Kalyana Lakshmi checks ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page