వివాహిత ఆత్మహత్య

0 31

చిత్తూరు     ముచ్చట్లు :
చిత్తూరు జిల్లా రెడ్డిపల్లి మండలం మునిపల్లిలో దారుణం జరిగింది. ఒక వివాహిత అత్త వారి ఇంటిముందే ఒంటిపై  పెట్రోల్ పోసుకొని అంటించుకుంది. క్షనికా వేశంలో తనకు తాను సజీవ దహనం చేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మునిపల్లి గ్రామానికి చెందిన హరి ప్రసాద్ రెడ్డి రెండు ఏళ్ళ క్రితం పుదుచ్చేరి రాష్ట్రం రెడ్డి వారి పాళ్యంకు చెందిన  సత్యవాణి ( 32)  తో ప్రేమ వివాహం జరిగింది. దంపతులు కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో కాపురం ఉంటున్నారు. కొద్దీ కాలంగా మనస్పర్థలతో వారిద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు.  గురువారం  అర్ధ రాత్రి తన సొంత స్కూటీపై భర్త స్వగ్రామమైన  మునిపల్లిలో అత్త వారింటికి చేరుకున్న కోడలు భర్త ఇంటిలో లేకపోవటంతో అత్త మామలతో తన భర్తను ఇంటికి పిలిపించాలని కోరింది. శుక్రవారం ఉదయం తెల్లవారి జాముర భర్త హరి ప్రసాద్ ఇంటికి చేరుకున్నాడు. అత్త మామల ముందే   ఇంటిలొనే భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. క్షనికా వేశంలో ఇంటి బయటకు వెళ్లి అప్పటికే తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని సత్యవాణి నిప్పు అంటించుకుంది.   అక్కడికక్కడే సజీవదహనం అయిపోయింది. భార్యను కాపాడే ప్రయత్నంలో గాయ పడ్డ భర్త  ను గ్రామస్థులు  ఆసుపత్రికి తరలించారు.

Tags:Married suicide

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page