తిరుమలలో మంత్రి మేకపాటి

0 10

తిరుమల ముచ్చట్లు :

తిరుమల శ్రీవారిని ఏపి పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో మంత్రి  మేకపాటి గౌతమ్ రెడ్డి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు..అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.. ఆలయ వెలుపలకు వచ్చిన మేకపాటి గౌతమ్రెడ్డి మాట్లాడుతూ..  స్వామి వారి దర్శనం శుక్రవారం రోజు జరగడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రతి ఆంధ్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని మొక్కుకున్నానని అన్నారు. రాష్ట్రంలో సూపరిపాలన అందిస్తున్న సిఎం  జగన్మోహన్ రెడ్డి పరిపాలనే కలకాలం కొనసాగాలని స్వామి వారిని వేడుకున్నాని ఆయన అన్నారు..

 

 

- Advertisement -

Tags:Minister Mekapati in Thirumala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page