క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభించిన మంత్రి వేముల

0 3

హైదరాబాద్  ముచ్చట్లు :

మాదాపూర్ హైటెక్స్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రపార్టీ షో ను ప్రారంభించారు. పలు స్టాల్స్ ప్రారంభించి ప్రపార్టీ షో లో ఏర్పాటు చేసిన స్టాల్స్ కలియతిరిగారు. మంత్రి మాట్లాడుతూక్రేడాయి ప్రపార్టీ షో లో 1500 ప్రాజెక్టునలు 100 స్టాల్స్ లో ఎగ్జిబిషన్ ఏర్పటూ చేసి రియల్ ఎస్టేట్ ముఖచిత్రాన్ని ప్రజల ముందు పెట్టినందుకు అభినందనలు. ఇది చాలా మంచి ప్రాపర్టీ షో. తెలంగాణ హైదరాబాద్ బిల్డర్ల్స్ రియల్ ఎస్టేట్ ప్రజలకు మంచి ప్రడక్ట్స్ అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణలో రియల్ ఏస్టేట్ ,నిర్మాణ రంగం నంబర్ వన్ గా నిలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటిఆర్ ఈ రంగాల అభివృద్ధికి ఎంతో కృషి చేసారు. ఈ రంగ అభివృద్ధి కి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పాలసీలు తెచ్చారు. గతంలో లా అండ్ ఆర్డర్ సమస్య ఉండేది కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కబ్జాలు లేవు ,రౌడీ షీటర్లు లేరు ఇతర సమస్యలు లేవు. లా అండ్ ఆర్డర్ బాగుంది కాబట్టి అన్ని పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఐటీ గ్రోత్ చెందుతుంది. కరెంట్ సమస్య ను అధిగమించాము. రాష్ర్రం ఏర్పడిన తర్వాత 15వేల ఐటీ కంపెనీలు కొత్తగా ఏర్పడ్డాయని అన్నారు. ఎప్లాయిమెంట్ పెరిగింది.దీని ద్వారా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ మున్సిపల్ ,ఐటీ పరిశ్రమలు మంత్రి గా నగరాన్ని అభివృద్ధి పథంలో తిసుకువెళుతున్నారు. ఎస్ఆర్డిపి కింద రహదారులు అభివృద్ధి చెందుతున్నాయి. రవాణా సౌకర్యం సులువు అవ్వడంతో ఈ రంగాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. క్రేడాయి ఎంతో ఘనత సాధించింది. సెంట్రల్ ప్రభుత్వం తో మాట్లాడుతున్నాం..ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారు…తద్వారా ఈ రంగం మరింత అభివృద్ధి సాధిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ విషయంలో లాండ్ సేకరణ 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళుతున్నారు. రియల్ ఎస్టేట్ లో మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా నిర్మాణాలు రూపొందాలి. ఎల్లకాలం ఈ ఇండస్ట్రీ బాగుండాలంటే మధ్యతరగతి ప్రజలను బాగస్వామ్యం అయ్యేలా చూడాలి. మీ సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు.  వ్యవసాయ భూములకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకువచ్చారు. ధరణి లో రిజిస్టర్ అయిన భూములకు రైతులకు ఎలాంటి సమస్యలు ఉండవు. ధరణిలో ప్రారంభంలో 47 సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్లాం అవి పరిష్కారించబడ్డాయి. టీఎస్ బి పాస్ ద్వారా  పారదర్శకంగా పని జరుగుతుంది. టీఎస్ బి పాస్ ద్వారా అనుమతులు త్వరగా లభించిన ఇతర వాటర్ వర్క్స్ ,ఎలెక్ట్రిసిటీ సమస్యలు ఉన్నాయని చెప్పారు.. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్తాను. తెలంగాణ హైదరాబాద్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

 

 

- Advertisement -

Tags:Minister Wemula launching the Credo Property Show

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page