తొమ్మిదేళ్ల బాలికపై మైనర్ బాలుడి ఆత్యాచారం

0 13

కడప ముచ్చట్లు :
కడప జిల్లాలో ధారుణం చోటు చేసుకుంది.కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ మైనర్ బాలుడు నిండా పదేళ్లు కూడా నిండని చిన్నారిపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామ శివారులో ఒంటరిగా కనిసించిన చిన్నారిని పొదల్లోకి ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ అమానుషం కడప జిల్లాలో చోటుచేసుకుంది.బాధిత కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లా చక్రాయపేటకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక స్కూల్ కు సెలవులు కావడంతో ఇంటివద్దే వుంటోంది. తల్లిదండ్రులకు చిన్న చిన్న పనుల్లో సాయం చేసేది. ఇలాగే ఈ కుటుంబం పెంచుకునే చిన్న మేకపిల్ల చనిపోవడంతో దాన్ని ఊరిబయట పడేయడానికి చిన్నారి బాలిక వెళ్లింది.అయితే బాలిక ఒంటరిగా వెళుతుండటాన్ని గమనించిన 14ఏళ్ల మైనర్ బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. బాలికను అనుసరించిన అతడు గ్రామ శివారులో నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లగానే లైంగిక దాడికి తెగబడ్డాడు. చిన్నారి బట్టలు చించి వాటినే అరవకుండా నోట్లో కుక్కి అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.బాలిక ఎంతసేపటికి తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెళ్లిచూడగా నగ్నంగా పడివుంది. ఆమెను ఇంటికి తీసుకువచ్చి అడగ్గా తనపై జరిగిన అఘాయిత్యం గురించి బయటపెట్టింది. దీంతో తల్లిదండ్రులు చక్రాయిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడి కోసం గాలిస్తున్నామని ఎసై రఘురామ్ తెలిపారు.మరోవైపు మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జెల లక్ష్మీ బాధిత బాలికను పరామర్శించారు.

 

 

Tags:Minor boy rapes nine-year-old girl

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page