చంద్రగిరి ప్రజలకు  ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోగ్య భరోసా  మరోమారు ఇంటింటికి ఆనందయ్య మందు పంపిణీకి శ్రీకారం

0 7

తిరుపతి ముచ్చట్లు :

థర్డ్ వేవ్ కరోనా నుంచి  చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించేందుకు మరోమారు 1.60 కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణీకి  ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా నడుంబిగించారు. శుక్రవారం తిరుపతి రూరల్ మండలం ఎంపిడిఓ కార్యాలయం  కేంద్రంగా ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. గడిచిన కరోనా వేవ్ పరిస్థితుల కన్నా అత్యంత ప్రమాదకరంగా థర్డ్ వేవ్ ముంచుకొస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నా వంతు బాధ్యతగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. వాలంటరీ ద్వారా ప్రతి ఇంటికి ఆనందయ్య మందు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. నిరంతరంగా ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. కరోనా నిబంధనలు తప్పక అనుసారించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతే కాకుండా చంద్రగిరి ప్రజల అవసరాల కోసం అత్యాధునిక పరికరాలతో కూడిన అంబులెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. గతంలో కూడా కరోనా కాలంలో ప్రజలకు అండగా నిలిచామని అందుకు మాస్క్ లు, సానిటైజర్లు, పండ్లు, కూరగాయలు, కోడి గుడ్లు, నిత్యావసర సరుకులు, విటమిన్ టాబ్లెట్ లు, సిరప్ లు తదితరాలు అందించినట్లు వెల్లడించారు. నా ప్రజల కోసం నా వంతు బాధ్యతగా ఎంత కష్టమైనా, ఎంత ఖర్చయినా బెనకాడబోనని వెల్లడించారు. నా ప్రజల కోసం అన్ని రకాలుగా సిద్దంగా ఉన్నానని తెలియజేశారు.

 

 

 

- Advertisement -

Tags:MLA Chevireddy health assurance to the people of Chandragiri
Another initiative is to distribute Anandayya medicine to households

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page