కోవూరు లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ప్రసన్న

0 9

నెల్లూరు     ముచ్చట్లు :
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం లో అధికారులతో సమీక్ష సమావేశాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నిర్వహించారు. కోవూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయం నందు నియోజకవర్గ అధికారులతో హౌసింగ్ పై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రివర్యులు, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటి నివేశన స్థలం మంజూరు చేయడంతో పాటు వారికి సొంత ఇల్లు నిర్మించే దిశగా అధికారులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ జాయింట్ కలెక్టర్  విధే ఖరే , జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ , డి పి ఓ ధనలక్ష్మి , నెల్లూరు జిల్లా మార్కెటింగ్ కోపరేటివ్ చైర్మన్ వీరి చలపతిరావు, నెల్లూరు జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ రెడ్డి , నెల్లూరు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ , వవ్వేరు బ్యాంక్ ఛైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి ,జొన్నవాడ దేవస్థానం మాజీ ఛైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి , స్థానిక వైకాపా  నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Tags:MLA Prasanna held a review meeting with the authorities in Kovur

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page