ఎమ్మెల్యే గారు మా పంటలను కాపాడండి…

0 7

నందికొట్కూర్ ముచ్చట్లు :
నందికొట్కూరు నియోజకవర్గం లోని మొక్కజొన్న పంట వేసుకున్న రైతులు వేడుకుంటున్నారని. రైతు సంఘం జిల్లా నాయకులు రాజు ఈ సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గంలొ  ఎత్తిపోతల పథకాలు ఉన్నప్పటికీ కొంత మంది రైతులకు ప్రయోజనం. మరి కొందరు రైతులకి అన్యాయం జరుగుతుందని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ వచ్చిన మరో వెంటనే మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా అనంతపురం జిల్లాకు నీటి నీటిని విడుదల చేయడం జరిగింది. మరుక్షణమే తాటిపాడు ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు వీటిని విడుదల చేసి వారి పంటలను కాపాడడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రైతుల సాధక బాధలను గుర్తించి. ఎత్తిపోతల పథకలను ప్రారంభించడం జరిగిందన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ వచ్చిన మరో వెంటనే తాటిపాడు ఎత్తిపోతల పథం ద్వారా రైతుల పంటలు ఎండిపోకుండా అక్కడ ఉన్న రైతు కమిటీ సభ్యులు నీటిని విడుదల చేయించడం జరిగింది. ఇప్పుడు వర్షం లేక 20 రోజులు వస్తుంది. ముందుగా పంటలు వేసుకున్న రైతులు అధిక వర్షాలతో నష్టపోవడం జరిగింది. రెండవసారి పంటలు వేసుకున్న లక్ష్మాపురం. పగిడ్యాల. కొణిదేల. బిజినవేముల. నందికొట్కూర్. మండ్లేం. తర్తూర్. రైతులు వర్షం లేక మొక్క జొన్నలు ఎండిపోవడం జరుగుతుంది. నాగటూర్ ఎత్తిపోతల పథకం ద్వారా వీటిని విడుదల చేస్తే పంటలను కాపాడుకోవచ్చని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే నాగటూరు ఎత్తి పోతల పథకం విడుదల చేయకుండా కొన్ని కారణాల వల్ల లిఫ్ట్ ను మభ్యపెట్టి కరెంటు పేరుతో కరెంటు డీపులు చెడిపోవడం జరిగిందని. రైతుల పంటలను ఎండబెట్టడం ఎంత వరకు సమంజసమని రైతు సంఘం నాయకులు కోరుతున్నారు. రైతు కమిటీ సభ్యులు కొట్లడుకోవడం తప్పా రైతుల బాధలను గుర్తించడం లేదన్నారు. ఎత్తిపోతల పథకం నీటిని విడుదల చేసి తమను కాపాడాలని అధికారులు నాయకులు గుర్తించడం లేదని మన నందికొట్కూరు శాసనసభ్యులు ఆర్థర్. తాటిపాడు. సేలిమిల్ల. సంగమేశ్వర ఎత్తిపోతల పథకలను ప్రారంభించడం జరిగిందని. ముఖ్యంగా చెప్పాలంటే మన ఎమ్మెల్యే గారికి  నాగటూరు ఎత్తిపోతల పథకం గుర్తుకు రావడం జరిగిందో. లేదో కానీ ఇప్పటికైనా ఒకసారి రైతన్నల బాధలను గుర్తించి నందికొట్కూర్ వైయస్ఆర్సిపి ఇన్చార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. నందికొట్కూర్ శాసనసభ్యులు ఆర్థర్. నాగటూర్ పోతల పథకం ద్వారా నీటిని విడుదల చేస్తారని రైతన్నలు రైతు  కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారని ఏపీ జిల్లా రైతు సంగం కమిటీ సభ్యులు బెస్త రాజు కోరారు.

Tags:MLA protect our crops …

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page