యాదాద్రిలో నాగుల పంచమి రద్ది

0 7

యాదాద్రి ముచ్చట్లు :

శుక్రవారం నాడు  నాగుల పంచమి సందర్భంగా యాదాద్రి కొండపైన వెలసిన పుట్ట లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు అనంతరం కొండపైన బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయనికి వెళ్లే ఘాటు రోడ్డు  గల పుట్ట వద్ద భక్తులు ఉదయం నుండి ఆదిశేషునికి భక్తి భావంతో విశేష పూజలు చేశారు. కొండపైకి వెళ్లే దారిలో గాట్ రోడ్డుపై వెలసిన పుట్ట వద్ద స్థానిక భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలుపోసి, నైవేద్యంగా పండ్లు మరి దీపారాధన చేసి ప్రత్యేక పూజలు చేశారు. నాగుల చవితి సందర్భంగా యాదాద్రిలో వెలసిన ఈ పుట్టలో పాలుపోసి ఎవరైతే కోర్కెలు కోరుతారో నాగదేవత తప్పకుండా వారి వారి కోర్కెలను నెరవేరుస్తుందని భక్తుల నమ్మకం అందుకని ప్రతి సంవత్సరము తప్పనిసరిగా నాగుల చవితి రోజున పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేస్తామని భక్తులు తెలిపారు. అనంతరం కొండపైన బాలాలయంలో ప్రతిష్టించిన సువర్ణమూర్తులు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

 

 

- Advertisement -

Tags:Nagula Panchami canceled in Yadadri

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page