జగిత్యాలలో ఘనంగా నాగులపంచమి వేడుకలు

0 6

పుట్టలవద్ద పండుగ వాతావరణం
కరోనాను తరిమికొట్టాలని మహిళల ప్రత్యేక పూజలు
జగిత్యాల  ముచ్చట్లు :
నాగులపంచమి వేడుకలను జగిత్యాలలో అత్యంత భక్తిశ్రద్ధలతో మహిళలు జరుపుకున్నారు.కరోనా బారినుండి  ప్రజలను రక్షించాలని జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.జగిత్యాల జిల్లాలోని పుణ్యక్షేత్రలైన ధర్మపురి, కొండగట్టు, కోటిలింగాల, పొలాస, దుబ్బారాజేశ్వరస్వామి, బీరుపూర్, చందయ్యపల్లె వెంకటేశ్వరస్వామి, నేరెళ్ల సాంబాశివా ఆలయంతోపాటు జిల్లాలోని 18 మండలాల్లో  మహిళా భక్తులు వేకువజమున తలంటుస్నానాలు ఆచరించి పాలు, పుట్నాలు, కొబ్బరికాయలు,పూలు, పసుపు, కుంకుమ తదితర పూజసామాగ్రితో పుట్టలవద్దకు వెళ్లి  భక్తితో పుట్టలో పాలుపొశారు.
పుట్టలవద్ద టెంకాయలు కొట్టి, పసుపు, కుంకుమ చల్లి, పుట్టలో పాలుపొసి పుట్నాలు నైవేద్యంగా సమర్పించి కుటుంబాలను చల్లగా చూడాలని నాగదేవతను వేడుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు.జగిత్యాల పట్టణంలోని వాణినగర్ ధర్మశాల, భక్త మార్కండేయ దేవాలయం, గొల్లపల్లి రోడ్ తాతమ్మ గుడి వద్ద, చిన్నగట్టు ఆంజనేయస్వామి ఆలయం, జిల్లాలోని గ్రామాల్లోనీ  పుట్టల వద్ద మహిళలు పుట్టలో పాలు పోయడానికి  పెద్ద ఎత్తున మహిళలు తరలిరావడంతో అప్రాంతాల్లో పండగవాతావరణం నెలకొన్నది.నాగుల పంచమి సందర్భంగా పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో నాగదేవతకు పాలాభిషేకం చేసి, అనంతరం దేవాలయంలో దేవత మూర్తులను దర్శించుకుని,  ఆలయంలో ఉన్న నాగదేవతకు మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి  పాలుపొసి  ప్రత్యేక పూజలు చేశారు.గ్రామాల్లో  స్థానిక సంస్థల మహిళా ప్రజాప్రతినిధులు నాగుల పంచమి పురస్కరించుకొని పుట్టల్లో పాలుపొసి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాలను చల్లంగాచుడాలని, కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని వేడుకున్నారు.

కోరుట్ల మండలంలో నాగులపంచమి వేడుకలు:

- Advertisement -

కోరుట్ల మండలంలోని నాగులపేట గ్రామంలో శుక్రవారం నాగులపంచమి సందర్భంగా నాగులమ్మ ను దర్శించుకునేందుకు నాగులపేట పరిసర ప్రాంతాల నుండి సుమారు 10 మంది విచ్చేసినట్లు, మహిళా భక్తులు వేకువజమున తలంటుస్నానాలు ఆచరించి పాలు, పుట్నాలు, కొబ్బరికాయలు,పూలు, పసుపు, కుంకుమ తదితర పూజసామాగ్రితో పుట్టలవద్దకు వచ్చి  భక్తితో పుట్టలో పాలుపొశారని నాగులమ్మ దేవాలయ కమిటీ అధ్యక్షులు చిట్టిరెడ్డి నారాయణ రెడ్డి, కోశాధికారి కె వెంకటరమణ, గ్రామ సర్పంచ్ కేతిరెడ్డి బాస్కర్ రెడ్డి, పేస్ చైర్మన్ ఎస్ నర్సారెడ్డి లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తుల సౌకర్యం కోసం గ్రామ అభివృద్ధి కమిటీ పక్షాన ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ  అధ్యక్షులు చిట్టిరెడ్డి నారాయణ రెడ్డి, కోశాధికారి కె వెంకటరమణ, గ్రామ సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్
రెడ్డి, పేస్ చైర్మన్ ఎస్ నర్సారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మాన్నగారి కిషన్ శర్మ, బ్రహ్మాన్నగారి శంకర్ శర్మ, పణింద్ర శర్మ, సునీల్ గ్రామ అభివృద్ధి కమిటి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Tags:Nagulapanchami celebrations are rich in Jagityas

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page