టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నరవ రమాకాంత్ రెడ్డి

0 5

మంత్రాలయం  ముచ్చట్లు :
మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని పెద్దకడబూరు మండలానికి చెందిన టిడిపి సీనియర్ యకుడు నరవ రమాకాంత్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిన  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు  నారా చంద్రబాబు నాయుడు కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పెద్దకడబూరు  టీడీపీ మండల కన్వీనర్ బసల దొడ్డి ఈరన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ నాయకుడు మనసున్న మహారాజు అయినటువంటి నరవ రమాకాంత్ రెడ్డి గారు టిడిపి పార్టీకి చేసిన సేవలను గుర్తించి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గారు రాష్ట్ర అధికార ప్రతినిధి గా నియమించడం మంత్రాలయం నియోజకవర్గంలోనే కాకుండా కర్నూలు జిల్లాలో కూడా నాయకులలో  కార్యకర్తలలో  నూతనుత్తేజం నింపుతుందని  పేర్కొన్నారు. ఈ సందర్భంగా నరవ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ టిడిపి పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుంపటిలో నెట్టి రాష్ట్ర ప్రజలు అందరినీ మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయిన చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. టిడిపి పార్టీలో నా సేవలను గుర్తించి నన్ను టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడంతో చంద్రబాబు నాయుడు కి ,యువనాయకుడు లోకేశ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రాష్ట్ర అధ్యక్షులు  అచ్చం నాయుడు కి మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి పాలకుర్తి తిక్కా రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ అధికారంలోకి లేకపోయినా నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహించిన పెద్దకడబూరు మండలం టిడిపి కన్వీనర్ బసల దొడ్డి ఈరన్న మరియు టిడిపి నాయకులు కార్యకర్తలకు గా కృతజ్ఞతలు తెలియజేశారు. నరవ రమాకాంత్ రెడ్డికి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గా పదవి లభించడం పట్ల అభిమానులు కార్యకర్తలు తెలుగుతమ్ముళ్లు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

Tags:Narava Ramakant Reddy as TDP state spokesperson

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page