జాతీయ జెండా ఆవిష్కరణ

0 11

అమరావతి ముచ్చట్లు :

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చేపట్టే కార్యక్రమాల్లో తల్లిదండ్రుల కమిటీలకు అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం..ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది.  స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15 న పాఠశాలల్లో నిర్వహించే జెండా వందన కార్యక్రమాన్ని తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ల ద్వారా నిర్వహించాలని ఆదేశాలిచ్చింది.  ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ బి.ప్రతాప్ రెడ్డి గురువారం మెమో జారీ చేశారు.   కోవిడ్ -19 ప్రోటోకాల్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసు కొని.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించాలని సూచించారు.  జిల్లా స్థాయిలో జాతీయ పతాకావిష్కరణను జిల్లా విద్యాధికారులు లేదా రీజనల్ జాయింట్ డైరెక్టర్లు చేయాలని పేర్కొన్నారు.  పాఠశాలల్లో మాత్రం తల్లిదండ్రుల కమిటీ చైర్మన్లతోనే పతాకాన్ని ఆవిష్కరింపజేయాలని స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Tags:National flag unveiling

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page