3రూపాయిల పెట్రోలు సబ్సిడీ

0 10

చెన్నై  ముచ్చట్లు :
దేశంలో చమురు ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ రూ.100 మార్క్ దాటేసి పరుగు పెడుతూనే ఉన్నాయి. దీంతో సామాన్యులు బండి బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు. చమురు ధరల పెరుగుదల కారణంగా నిత్యావసరాల ధరలు కూడా ఆశాకాన్నంటాయి. అసలు పెట్రోల్ ధర కంటే కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు వేసే ట్యాక్సులే చమురు ధరలకు పెరుగుదల కారణమన్నది అందరికీ తెలిసిందే. అందుకే ప్రభుత్వాలు కాస్తయినా పన్నుల తగ్గించుకుంటే పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త అదుపులోకి వస్తాయని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనేతమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న స్టాలిన్ సర్కార్ లీటర్ పెట్రోల్‌పై రూ.3లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.దీనికి సంబంధించిన తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ శుక్రవారం ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతున్నప్పటికీ చమురు ధరల నుంచి సామాన్యులకు ఊరట కలిగిచాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారని త్యాగరాజన్ తెలిపారు. లీటరు పెట్రోలుపై రూ.3 ధర తగ్గించడం వల్ల తమిళనాడు రాష్ట్ర ఖజానాకు రూ. 1,160 కోట్ల నష్టం వస్తుందని, అయినా ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.ఇప్పటివరకు చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.49గా ఉంది. అయితే ప్రభుత్వం తాజాగా రూ.3లు తగ్గించడంతో పెట్రోల్ ధర రూ.100 దిగువకు చేరనుంది. అయితే పెట్రోల్ ధర తగ్గింపు ఎప్పటి నుంచి అన్నది ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. పెట్రోల్ పాటు డీజిల్‌పైనా తగ్గింపు అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.

 

 

Tags:Petrol subsidy of Rs

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page