వివేక ఇంటి వద్ద రెక్కీ…

0 17

కడప  ముచ్చట్లు :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకొక మలుపుతిరుగుతోంది. వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుగా ముందుకెళ్తోంది. దీంతో రోజుకొక కొత్త పేరు బయటకు వస్తోంది. వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సైతం సీబీఐ అధికారులు కనిపెట్టడంతో.. కేసు ఓ కొలిక్కి వచ్చిందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఇందుకు రెక్కీ కూడా నిర్వహించారని సంచలనం రేపారు.ఈ మేరకు తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కడప ఎస్పీకి వైఎస్‌ సునీత లేఖ రాశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె వాపోయారు. ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5:20 గంటల సమయంలో ఓ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్‌ తర్వాతి డోర్‌ దగ్గర ఆగి ఫోన్‌ కాల్స్‌ చేశాడని లేఖలో సునీత వెల్లడించారు. తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కడప జిల్లా ఎస్పీకి వైఎస్‌ సునీతా రెడ్డి లేఖ రాశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె వాపోయారు. ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్‌ తరువాతి డోర్‌ దగ్గర ఆగి ఫోన్‌ కాల్స్‌ చేశాడని లేఖలో సునీత పేర్కొన్నారు. శివశంకర్‌రెడ్డి బర్త్‌ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. చివరికి ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని వివరించారు. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత లేఖలో పేర్కొన్నారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని ఆమె జిల్లా ఎస్పీని కోరారు. అయితే, వివేకా హత్య కేసులో ఈ రోజు సీబీఐ విచారణకు శివశంకర్‌రెడ్డి హాజరయ్యారు.వివేకా హత్య కేసులో ప్రధాన అనుమానితుడు శివశంకర్‌రెడ్డి బర్త్‌ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని సీఐకి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.చివరికి, ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని సునీత తెలిపారు. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత వెల్లడించారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని కోరారు. అయితే వివేకా హత్య కేసులో శుక్రవారం సీబీఐ విచారణకు శివశంకర్‌రెడ్డి హాజరయ్యారు.

Tags:Rekki at the slick house …

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page