నాంపల్లి కోర్టుకు హాజరైన రేవంత్

0 6

హైదరాబాద్  ముచ్చట్లు :
ఓటుకు నోటు కేసులో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతోపాటు ఉదయ్‌సింహా, సెబాస్టియన్‌ కూడా హాజరయ్యారు. కాగా, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు సాక్షుల వాంగ్మూలాన్ని న్యాయస్థానం నమోదు చేసింది.ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణకు వచ్చింది. వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌రెడ్డి రేవంత్‌రెడ్డి మాజీ పీఏ సైదయ్య వాంగ్మూలం నమోదు చేశారు. నరేందర్‌రెడ్డి బంధువుతోపాటు మరొకరు గురువారం విచారణకు హాజరయ్యారు. వారి వాంగ్మూలాలను కోర్టు రికార్డు చేసింది. తదుపరి విచారణ రేపటి(శుక్రవారం)కి వాయిదా వేశారు. కాగా, తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఇందుకు సంబంధించి రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది.ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ నేత చంద్రబాబు నాయుడు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ కేసులో రేవంత్‌రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

 

 

Tags:Rewanth appearing in Nampally court

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page