ఘనంగా నాగుల చవితి

0 15

కామారెడ్డి ముచ్చట్లు :

నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో నాగుల పంచమి వేడుకలు భక్తులు ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని పలు ఆలయాల వద్ద గల పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంగడి బజార్ పోచమ్మ ఆలయం వద్ద గల పుట్టలో పాలు పోసి కొబ్బరికాయలు కొట్టి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.. పంచముఖి హనుమాన్ కాలనీ, సాయిబాబా గుడి, గాంధీనగర్, పెద్దమ్మ గల్లి లో గల పుట్ట ల వద్దకు భక్తులు ఉదయం నుంచే భారీ సంఖ్యలో చేరుకొని పాలు పోసి తమ మొక్కులను తీర్చుకున్నారు.. శ్రావణ మాసంలో తొలి శుక్రవారం కావడంతో ఆలయాలు భక్తుల తో కిటకిటలాడాయి.. పుట్టలో పాలు పోసిన తర్వాత పాటలు పాడుకుంటూ  తమ ఇంటి వద్దకు వెళుతూ జొన్న పేలాలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ భక్తులు ఇంటి దారి పట్టారు.

 

 

- Advertisement -

Tags:Richly bitten by snakes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page