స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన సీస్  

0 8

హైదరాబాద్ ముచ్చట్లు :
గోల్కొండ కోట వద్ద స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల ఏర్పాట్లను  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. రిహార్సల్స్, పోలీసుల మాక్ డ్రిల్ ను తనిఖీ చేసి అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. 75వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈ నెల 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అందుకు సరైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో టిఆర్ అండ్ బి  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, అదనపు డిజి జితేందర్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్,  ఎనర్జీ కార్యదర్శి  సందీప్ కుమార్ సుల్తానియా, జిహెచ్ ఎంసి కమీషనర్ లోకేశ్ కుమార్ మరియు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

Tags:Seas examining the arrangements for the Independence Day celebrations

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page