మైనర్ బాలికపై లైంగిక దాడి ,నిందితునిపై పొక్సో కేసు

0 43

-సీఐ శివకుమార్ రెడ్డి ఎస్సై పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో నిందితుని అరెస్ట్
-మైనర్ బాలికలను లైంగికదాడులు వేధింపులు చేపడిటే కఠిన చర్యలు తప్పవు

 

వరదయ్యపాలెం ముచ్చట్లు :

 

- Advertisement -

వరదయ్యపాలెం మండలం కురుంజలంకు చెందిన ఓ మైనర్ బాలికను కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ శివకుమార్ రెడ్డి ఎస్సై పురుషోత్తం రెడ్డి దర్యాప్తు చేపట్టి విచారించగా నెల్లూరు జిల్లా తడ మండలం వెనాడు దర్గా వద్ద బాలిక ఆచూకీ కనుగొని ఆరా తీయగా.. బీఎన్ కండ్రిగ మండలం తలారివెట్టు పంచాయతీ ఎన్టీఆర్ నగర్ కు చెందిన సుబ్రమణ్యం (30)అనే (ఇద్దరు పిల్లలతండ్రి) ఆ బాలికకు మాయమాటలు చెప్పి అపహరించి అత్యాచారం చేసినట్లు తెలపడంతో అదృశ్యం కేసు ను పోక్సో కేసు కింద నమోదు చేసి నిందితుడు సుబ్రమణ్యం ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ శివకుమార్ రెడ్డి ఎస్సై పురుషోత్తం రెడ్డి తెలిపారు.మైనారిటీ తీరని బాలికలపై అపహరణ, వేధింపులు, అత్యాచార యత్నాలు చేయడం వంటి నేరాలపై నాన్ బేయిలబుల్ సెక్షన్లతో కఠిన చట్టాలు అమలులో ఉన్నందున ఇలాంటి దుర్మార్గ చర్యలకి పాల్పడ్డ నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శివకుమార్ రెడ్డి అన్నారు.

 

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

Tags: Sexual assault on minor girl, poxo case against accused

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page