ఇంగ్లండ్‌లో కాల్పులు.. ఆరుగురి మృతి

0 6

ఇంగ్లాండ్ ముచ్చట్లు :

 

ఇంగ్లండ్‌లోని ప్లైమౌత్ నగరంలో ఈ ఉదయం కాల్పుల కలకలం రేగింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6.10 గంటలకు కొందరు దుండగులు తుపాకులతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కీహామ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. కాల్పులకు తెగబడిన దుండగులకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాల్పులు జరిపిన దుండగుల్లోని ఓ వ్యక్తి కూడా మృతుల్లో ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

- Advertisement -

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

Tags: Six killed in shooting in England

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page