పాలిచర్లపాడులో అంకమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

0 2

గ్రామ పొంగళ్ళు. పోతురాజు శిలలు ఏర్పాటు
నెల్లూరు  ముచ్చట్లు :
నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, పాలిచర్ల పాడు గ్రామంలో శ్రీ శ్రీ అంకమ్మ తల్లి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు మరియు గ్రామ పొంగళ్ళు  ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలు ఆయా దేవస్థాన కమిటీలు మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంకమ్మ తల్లి దేవస్థాన ప్రాంగణంలో శాస్త్రోక్తంగా పోతురాజు శిలలు ఏర్పాటు చేశారు. అనంతరం అంకమ్మ తల్లి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, చక్కెర  పొంగళ్ళు నిర్వహించారు. ఈ సందర్భంగా  స్థానికులకు, భక్తులకు అమ్మ వారి ప్రసాదం పులిహోర మరియు గుగ్గిళ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అంకమ్మ తల్లి దేవస్థాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ పూర్వీకుల కాలం నుండి ఇ గ్రామదేవతగా అంకమ్మ తల్లి ని పూజించడం జరుగుతుందన్నారు. తల్లి చల్లని చూపులతో, ఆశీస్సులతో  గ్రామంలోని ప్రజలకు ఎటువంటి చీడా,పీడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు అంకమ్మ తల్లి కృప ఉందన్నారు. నియమనిష్ఠలతో అమ్మ ను పూజించి కోరిన కోర్కెలు నెరవేర్చడంలో అంకమ్మ తల్లి కి ఆమే సాటి అని, తల్లి కరుణాక కటాక్షాలు గురించి వివరించారు .ఈ కార్యక్రమంలో అంకమ్మ తల్లి దేవాలయం కమిటీ చైర్మన్ పాలిచర్ల ఏడుకొండలు, వైస్ చైర్మన్ శివ, కార్యక్రమ నిర్వాహకులు కంటేపల్లి ప్రసాద్ మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags:Special pujas for Ankamma’s mother in Palicharlapadu

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page