సబ్ కలెక్టర్ ను నియమించాలి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా

0 8

కోరుట్ల ముచ్చట్లు :

మెట్ పల్లిలో గత కొన్ని రోజులుగా ఖాళీగా ఉంటున్న సబ్ కలెక్టర్ వారి పోస్టును వెంటనే నియామకం చేయాలని కాంగ్రెస్ పార్టీ మెట్ పల్లి పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా అన్నారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. డివిజన్ కేంద్రం అభివృద్ధికి కీలకంగా వ్యవహరించే సబ్ కలెక్టర్ పోస్టు గత కొన్ని రోజులుగా ఖాళీగా ఉండడంతో పాలన సజావుగా సాగడం లేదన్న ప్రజల్లో ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ప్రజలు కొన్ని సమస్యలు సబ్ కలెక్టర్ వారికి నేరుగా విన్నవించుకుందామంటే వారు లేకపోవడంతో ప్రజలు నిరాశతో ఉంటున్నారన్నారు. సంబంధిత ప్రజాప్రతినిధులు స్పందించి మెట్ పల్లి కేంద్రానికి వెంటనే సబ్ కలెక్టర్ ను నియామకం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

 

 

- Advertisement -

Tags:Sub-collector should be appointed, Congress town president Mohammad Khutbuddin Pasha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page