హిందూ దేవాలయాల విషయంలో వైసీపి ప్రభుత్వం పారదర్శకత ప్రదర్శించాలి  బిజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

0 8

తిరుమల ముచ్చట్లు :

హిందూ దేవాలయాల విషయంలో విషయంలో ఒకలా, అన్యమతస్తుల విషయంలో మరోలా వైసీపి ప్రభుత్వం వ్యవహరించడం సరైన విధానం బిజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఘ్ణ వర్ధన్ రెడ్డి మండిపడ్డారు..ఇవాళ ఉదయం వి.ఐ.పివిరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు..అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు..ఏపిలో వైసీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ధార్మిక క్షేత్రాలకు సంబంధించిన విషయంలో ఒకరకమైన అభిప్రాయం,అన్యమతాలకు సంబంధించిన విషయంలో భిన్న కోణంలో వైసీపి ప్రభుత్వం చూస్తుందని ఇవాళ కోట్ల మంది హిందువుల అభిప్రాయంమని ఆయన అన్నారు..ఏపిలో గతంలో ఉన్న ప్రభుత్వాలు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం హిందూ దేవాలయాల్లో భక్తుల కానులు సమర్పించే వాడిలో 21 శాతం ట్యాక్స్ రూపంలో తీసుకుంటుందన్నారు..దేవాదాయశాఖ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ అని చెప్పి 8 శాతం,సిజిఎప్ అని చెప్పి 9శాతం,అర్చక వెల్ఫేర్ ఫండ్ క్రింద మూడు శాతం,ఆడిట్ పేరు మీద 1.5 శాతం తీసుకుటుందని, దేవాలయాల్లో భక్తుల సమర్పించిన కానుకలను వివిధ ట్యాక్స్ రూపాల్లో ప్రభుత్వం తీసుకోవడం అన్యాయంమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు..హిందూ దేవాలయాలల్లో కానుకల నుంచి తీసుకున్న నగదు హిందూ దేవాలయాలకు సంబంధించిన అర్చకులకు,సిబ్బంది,దేవాదాయశాఖ వారి డబ్బులు ఇస్తున్నారని,దర్గాలకు,మసీదులకు,చర్చులకు వచ్చే డబ్బును ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు..వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న చర్చలకు సంబంధిన కమిటీలు కొట్టుకుంటున్నారని,హిందూ ఆలయాలకు సంభందించిన వాటిపైనే ప్రభుత్వం పెత్తనం చేస్తుందని,అన్యమతస్తుల మతస్తులకు సంబంధించన వాటిపై ఎందుకు పెత్తనం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు..ప్రభుత్వం కొత్త చట్టంను ప్రవేశ పెట్టాలని బిజేపి తరపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు..ప్రభుత్వం రాజకీయ కోణంలో తీసుకోకుండా దేవాలయాల నిర్మాణంకు,ధూపదీప నైవేద్యాలు ఇస్తున్న డబ్బును రాష్ట్ర నిధుల నుండి ఇవ్వాలని,రాష్ట్ర నిధుల నుండి చర్చిలు,దర్గా,మసీదుల నిర్మాణంకు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసారు..అన్ని మతాలను సమానంగా చూస్తూ హిందూ దేవాలయాల నుండి తీసుకుంటున్న 21 శాతం ట్యాక్స్ ను వేంటనే రద్దు చేయాలని బిజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి డిమాండ్ చేసారు.

 

 

- Advertisement -

Tags:The YCP government should show transparency in the case of Hindu temples
BJP state general secretary

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page