కైకలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నకిలీ ఈ చలానాలు

0 18

విజయవాడ ముచ్చట్లు :

కృష్ణాజిల్లా కైకలూరు    సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నకిలీ ఈ చలానా లతో సుమారుగా కోటి రూపాయల కుంభకోణం  వెలుగులోకి వచ్చింది.  చలానా ల దుర్వినియోగం అరికట్టేందుకు  ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చలానా కు  సి ఎఫ్ ఎం ఎఫ్ కు అనుసంధానం చేసే ఈ క్రమంలో కుంభకోణం బయట పడినట్టు సమాచారం. అనుమానం వచ్చి రికార్డులను జిల్లా రిజిస్టర్ కార్యాలయంకు తీసుకుని వెళ్లి తనిఖీ చేయగా మంగళవారం సాయంత్రం వరకు  సుమారుగా రూ  కోటి  37 లక్షల వరకు మోసం జరిగినట్టు గుర్తించామని సిబ్బంది తెలిపారు.  స్టాంప్ డ్యూటీ.  రిజిస్ట్రేషన్ ఫీజు కోసం చెల్లించే  చలనాలను కొందరు దుర్వినియోగం చేసినట్టు సమాచారం.  రిజిస్ట్రేషన్ కోసం బ్యాంకుల్లో చలానా తీసి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సమర్పించాక కొందరు మళ్లీ  దానిని వినియోగిస్తున్నారు.  మాన్యువల్ గా చలానా స్వీకరించడం,  దానిని పిడిఎఫ్ గా అప్లోడ్ చేసే క్రమంలో దుర్వినియోగానికి ఆస్కారం ఉన్నట్టు పలువురు తెలుపుతున్నారు.  అలాగే చలానాలు కట్టి రిజిస్ట్రేషన్ కు  రాకుండా వేచి ఉంటే వారి చలానాలు   దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడిన ఈ సంఘటన పక్కదోవ పట్టించేందుకు పలువురు నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.  ఈ సంఘటనపై సబ్ రిజిస్టార్ కె.వి వి ఎస్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యంను  వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ కుంభకోణం బయటపడ్డ విషయం నిజమేనని నిర్ధారించారు.  జిల్లా రిజిస్టర్ కార్యాలయంకు రికార్డు పంపగా అక్కడ  విచారణ జరుగుతుందని ఎంత మొత్తం అనేది త్వరలో  బయటపడుతుందని అన్నారు. ఈ విషయమై  పోలీస్ స్టేషన్లో కంప్లైంటు ఇచ్చామని తెలిపారు..

 

- Advertisement -

Tags:These circulars were forged at the Kaikaloor Sub-Registrar’s office

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page