ట్విట్టర్ డేంజర్ గేమ్ ఆడుతోంది

0 22

న్యూఢిల్లీ ముచ్చట్లు :

 

దేశ రాజకీయాల్లో మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌కు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ట్వీట్‌తో రాజకీయాల్లో పెను సంచలనాలు జరుగుతోన్న రోజులివీ. ట్విట్టర్‌ వ్యవహారం ప్రస్తుత రోజుల్లో రాజకీయ మలుపులు తీసుకుంటున్న సంఘటనలు కూడా చూస్తున్నాం. ఇప్పటికే దేశంలోని పలువురు రాజకీయనాయకులకు చెందిన ఖాతాలను బ్లాక్‌ చేయడం మళ్లీ తర్వాత యాక్టివ్‌ చేస్తూ ట్విట్టర్‌ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ఖాతాను నిలిపి వేసిన విషయం తెలిసిందే. తమ నిబంధనలకు విరుద్ధంగా ట్వీట్ చేసిన కారణంగానే రాహుల్‌ గాంధీ అకౌంట్‌ను బ్లాక్‌ చేసినట్లు ట్విట్టర్‌ వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే తన ట్విట్టర్‌ ఖాతాను బ్లాక్‌ చేయడం పట్ల రాహుల్‌ గాంధీ స్పందించారు. ఈ క్రమంలో ఓ వీడియోను విడుదల చేశారు.
ఇందులో రాహుల్‌ మాట్లాడుతూ.. ‘నా ట్విట్టర్‌ ఖాతాను మూసేసి ట్విట్టర్‌ రాజకీయ వ్యవస్థలోకి తలదూర్చింది. ఒక కంపెనీ మా పనిని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నం రాజకీయనాయకుడిగా నాకు నచ్చలేదు. ఇది రాహుల్‌ గాంధీపై చేసిన దాడి కాదు.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై చేసిన దాడి. నాకు సుమారు 2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు, ట్విట్టర్‌ వారి హక్కును అడ్డుకుంది. ఇది చట్ట వ్యతిరేకమే కాకుండా.. ట్విట్టర్‌ ఒక తటస్థ వేదిక అనే ఆలోచనను కూడా కాలరాసింది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ట్విట్టర్‌ అధికారంలో ఉన్న ప్రభుత్వం చెప్పే మాటలను వింటోంది. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. మేము పార్లమెంట్‌లో మాట్లాడలేకపోతున్నాం. మీడియా కూడా కంట్రోల్‌ ఉంది. ఈ సమయంలో మా అభిప్రాయాలను తెలిపేందుకు ట్విట్టర్‌ అనేది మాకు ఒక ఆశా జ్యోతిలా కనిపించింది. కానీ ప్రస్తుతం ట్విట్టర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చారు రాహుల్‌. ఇదిలా ఉంటే రాహుల్‌ గాంధీతో పాటు రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా, అజయ్‌ మాకేన్‌, సుస్మిత దేవ్‌, మాణిక్యమ్‌ ఠాగూర్‌ అకౌంట్‌లను సైతం ట్విట్టర్‌ తాత్కాలికంగా బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

Tags; Twitter Danger Game Playing

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page