దివాళా దిశగా వైఎస్ జగన్ పాలన

0 13

రాజమండ్రి  ముచ్చట్లు :

సూట్ కేసు కంపెనీలు పెట్టిన అనుభవంతో సూట్ కేసు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ఆర్ధికంగా దివాలా తీసే విధంగా జగన్ రెడ్డి  పాలన సాగుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.తూర్పుగోదావరి జిల్లా రాజమహేంధ్రవరంలో మాట్లాడుతూ ఇష్టారీతిన చేస్తున్న అప్పులు, నిధుల దుర్వినియోగం మీద కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీలు వేసే స్థాయికి రాష్ట్ర ప్రతిష్టను జగన్ దిగజార్చారని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.లక్ష 56 వేల 848 కోట్లు అప్పులు తెచ్చారని, సగటున రోజుకు రూ. 835 కోట్లు ఖర్చు పెడుతున్నారని, ఈ నిధులన్ని ఎక్కడికి వెళ్లిపోతున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.శాసనసభ సమావేశాలు నిర్వహించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని,సమావేశాలు నిర్వహించినా ఒకటి రెండు రోజులు తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి … ఈ రోజు సకాలంలో ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారని అన్నారు.‎

 

- Advertisement -

Tags:YS Jagan rule towards bankruptcy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page