బైకు దొంగలు ఆరెస్టు

0 15

విశాఖపట్నం  ముచ్చట్లు :
విశాఖలో బైక్స్ చోరీకి పాల్ప డుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. ఆరు స్టేషన్ లు పరిధిలో 27 మంది అరెస్ట్ 33 బైక్స్ స్వాధీనం చేసుకున్నా రు.బైక్స్ దొంగతనం చేసిన ముగ్గురు నిందితుల్లోమాలోతు ఎర్రన్నాయుడు  విజయనగరం జిల్లా గంట్యాడ ప్రాంత నికి చెందిన వ్యక్తి, మరో ఇద్దరు మైనర్ బాలలు అరెస్ట్ చేసినట్లు విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు.వీరి నుంచి బైక్స్ కొనుగోలు చేసిన 24 మంది అరెస్ట్ చేశామని, విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధి  పెందుర్తి, గాజువా క, మల్కాపురం, విజయనగరం జిల్లా లో పలు స్టేషన్ పరిధిలో కేసులు నమో దు చేసినట్లు వివరించారు.13 లక్షల 20 వేల విలువైన బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నగరంలో కోవిడ్ నిబంధనలు పగలు పాటించకుంటే..మాస్క్ ధరిం చకున్నా ఫైన్స్ వేస్తున్నామని విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పా టించాలని,పగలు ఉదయం 6 గంటలు నుంచి రాత్రి 10 గంటలు వరకు 100 రూపాయలు 1500 -1800 ఫైన్స్ వేస్తున్నామని తెలిపారు.రాత్రి10 నుంచి ఉదయం 6 గంటలు వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉందని, రాత్రి పూట ఫైన్ 500 రూపా యలు ఉంటుందని వివరించారు. రోజుకు 10 నుంచి 15 ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తున్నామని తెలిపారు.

 

 

Tags:Bike thieves arrested

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page