పంచుడులో పోటీ ,తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్

0 14

హైదరాబాద్  ముచ్చట్లు :

కష్టపడకుండానే డబ్బులు ఇస్తున్నారు. ఏ పనిచేయకుండానే ఉత్తి పుణ్యాన వందల కోట్లు కుమ్మరిస్తున్నారు. సంక్షేమ పథకాల పేరిట రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ముఖ్యమంత్రులూ తీసుకోని నిర్ణయాలను జగన్, కేసీఆర్ లు తీసుకుంటుండటం ఆర్థిక నిపుణులను సయితం ఆశ్చర్యపరుస్తోంది. ఇలా అభివృద్ధిని పక్కన పెట్టి ప్రజలకు పప్పుబెల్లాలుగా పంచడాన్ని కొందరు బహిరంగంగానే తప్పుపడుతున్నారు.జగన్ విషయానికొస్తే ఆయన ముఖ్యమంత్రిగా రెండేళ్ల పాలనలో చేసిందేమిట్రా అంటే.. లక్ష కోట్లు పంచడమేనని చెప్పుకోవాలి. అమ్మఒడి, వాహనమిత్ర, రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా అంటూ అనేక పథకాల ద్వారా దాదాపు లక్షలాది కుటుంబాలకు ఆర్థిక లబ్ది చేకూర్చారు. కరోనా సమయంలోనూ జగన్ ఈ డబ్బు పంపిణీ ఆపలేదు. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం, ఆసుపత్రుల్లో వసతుల పెంపుదల కంటే వీటికే జగన్ ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు ఎక్కువగా విన్పించాయి.ఇక తెలంగాణ విషయానికొస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్నటి వరకూ కొంత అభివృద్ధిపైనే దృష్టి పెట్టేవారు. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయమే ఉండటంతో స్పీడ్ పెంచారు. లక్ష కోట్లు దళిత బంధు పేరిట పంచుతానని స్పష్టమైన ప్రకటన చేశారు. సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించి రావాల్సి ఉండటంతో కాసుల కోసం ప్రభుత్వ భూములను విక్రయించాల్సిన పరిస్థితి తెలంగాణలో నెలకొంది. ఎన్నికల సమయం కావడంతో ఇక వచ్చేవన్నీ సంక్షేమీ పథకాల హామీలే.ఈ హామీల అమలు కోసం జగన్, కేసీఆర్ లు ఇద్దరూ అప్పలు మరిన్ని చేయక తప్పదు. తెలంగాణలో భూముుల అమ్మకం ద్వారా, ఏపీలో అప్పులు చేయడం ద్వారా వెల్ఫేర్ స్కీమ్ లను కులాల వారీగా విభజించి అమలు చేసే ప్రక్రియ మొదలయింది. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రులపైనా విమర్శలు ఎక్కువగా విన్పిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో రోడ్లు అద్వాన్న స్థితిలో ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు పంచుడు కార్యక్రమంతో దంచుడు మొదలుపెట్టారు. బూమ్ రాంగ్ అయిందో ఇద్దరూ వెనక సీటుకు వెళ్లక తప్పదు.

 

- Advertisement -

Tags:Competition in Panchudu, a new trend in the Telugu states

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page