తెలుగు భాష అభివృద్దికి కృషి

0 14

తిరుమల ముచ్చట్లు :
తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తాంని తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీ పార్వతి అన్నారు..ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు..అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ…తెలుగు బాషా చైతన్య సదస్సులు తిరుపతిలో నిర్వహించాంమని,తెలుగు, సంస్కృత బాషా కవులు ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున్న పాల్గొన్నారని ఆమె తెలియజేసారు..తెలుగు అకాడమీ పని తీరు చూసి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు..ఒక్క ఏడాదిలో తెలుగు అకాడమీ ఎన్నో విజయాలు సాధించిందని సంతోషం వ్యక్తం చేసారు..పుస్తకాల ప్రింటింగ్ చేయించాంమని,మరో పది రోజుల్లో పుస్తకాలను విద్యార్థులకు అందిస్తాంమన్నారు..తిరుపతి కేంద్రంగా తెలుగు సంస్కృతి అకాడమీ బాధ్యతలు జగన్ నాకు ఇచ్చారని ఆనందం వ్యక్తం చేసారు..తెలుగు బాషా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాంమని,లోయర్ క్లాస్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు తెలుగు తప్పనిసరి చేసాంమని ఆమె ధీమా వ్యక్తం చేసారు..గత ప్రభుత్వం వదిలేసిన, వైసీపీ ప్రభుత్వం తిరిగి తెలుగు అకాడమిని తీసుకొచ్చిందన్నారు..టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డి నియమించడం ఆనందదాయకంమన్నారు..

 

- Advertisement -

Tags:Efforts for the development of Telugu language

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page