అమరరాజా నూతన చైర్మన్‌గా రేపు బాధ్యతలు చేపట్టనున్న గల్లా జయదేవ్

0 12

తిరుపతి ముచ్చట్లు :

అమరరాజా బ్యాటరీస్ నూతన చైర్మన్‌గా గల్లా జయదేవ్ ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ అధినేత గల్లా రామచంద్రనాయుడు ప్రకటించారు. తిరుపతి సమీపంలోని కరకంబాడిలో ఉన్న పరిశ్రమ ఆవరణలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. గౌరినేని హర్షవర్ధన్, గౌరినేని విక్రమాదిత్య డైరెక్టర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. చైర్మన్‌గా రేపు బాధ్యతలు స్వీకరించనున్న గల్లా జయదేవ్ మాట్లాడుతూ పరిస్థితులను బట్టి ఏం జరగాలన్నది కాలమే నిర్ణయిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

- Advertisement -

Tags:Galla Jayadev will take over as the new chairman of Amarrajah tomorrow

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page