కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసుల….

0 13

ఆదోని ముచ్చట్లు :
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం కర్ణాటక సరిహద్దు ఉండడంతో కర్ణాటక మద్యం విచ్చలవిడిగా మార్కెట్లో  తరలిస్తున్నారు అనేకసార్లు అరెస్టు చేసిన రిమాండ్కు పంపించిన పరవాలేకుండా పోతుంది.. ఆదోని పట్టణ స్టేషన్ లో పాటు ఎక్సైజ్ అధికారులు కూడా ఎన్నోసార్లు కర్ణాటక మద్యంను అమ్మవారి పై దాడి చేసి పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది కానీ వాళ్లని చీమకుట్టినట్లు కూడా లేదంటే పరిస్థితి కొనసాగుతుంది.. కర్ణాటక మద్యం ఓ.సి 180ml 90 రూపాయలు అమ్మి డెడ్రా ప్యాకెట్ ఆదోనిలో రెండు వందల రూపాయలకు అమ్మడం జరుగుతున్నది దీనికి డబ్బులు ఎక్కువ సంపాదించుకోవాలనే ఆశతో చాలామంది ఇలాంటి దానికి బానిస అవుతున్నారు. దాంతోపాటు డబ్బు ఆశ చూపించు ఆడ వాళ్లను కూడా లెక్క చేయకుండా మద్యం తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక్క రూపాయి మద్యం ఉంటే రెండు రూపాయలు ఆదాయం ఉంటుందంటూ ఆశపడి ఇలాంటి అడ్డదారి కు పాల్పడుతున్నారు.. ఇలాంటి సమయంలో శనివారం రోజున ఆదోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో లో రైలు మార్గం ద్వారా 180 ml ఓ.సి 96 ప్యాకెట్లను ట్రావెలింగ్ బ్యాగ్ లో తరలిస్తుండగా  రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు అనుమానాస్పదంగా వెళుతున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారించగా 96 డెడ్ రా ప్యాకెట్ ట్రావెలింగ్ బ్యాక్ లో ఉండడంతో స్టేషన్ తరలించి దాని విలువ దాదాపు 18000 వేలు ఉన్నట్లు వాళ్ళ పై కేసు నమోదు చేయడం జరిగిందని ఆదోని టూ టౌన్ సీఐ శ్రీరాములు మీడియాకు తెలియజేశారు..

 

Tags:Karnataka police arrest two women for smuggling liquor

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page